Weight Loss: ఇలా చేస్తే పిల్లలు వేగంగా బరువు తగ్గుతారు..

First Published Aug 20, 2022, 1:10 PM IST

Weight Loss: స్లిమ్ గా, చురుగ్గా ఉంచే పిల్లలు సైతం ఇప్పుడు ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ ఊబకాయం పిల్లల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. 

చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా నేడు ఎంతో మంది పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. అయినా ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఇకపోతే పెద్దలే కాదు చిన్నపిల్లలు కూడా వేగంగా బరువు పెరిగిపోతున్నారు. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ అధిక బరువు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.  ఈ బరువు వల్ల పిల్లలు మానసికంగా కూడా క్రుంగిపోతారు. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు. అందుకే తల్లిదండ్రులు పిల్లల బరువును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. పిల్లలు బరువు తగ్గేందుకు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

kids

ఆహారంలో మార్పులు

 ఏది పడితే అది పిల్లలకు పెట్టడం వల్ల కూడా పిల్లలు వేగంగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా పెట్టడం వల్ల కూడా తొందరగా బరువు పెరుగుతారు. అందులోనూ పిల్లలకు ఇంట్లో ఫుడ్ కంటే బయటి ఫుడ్ యే ఎక్కువగా నచ్చుతుంది. అందుకే తల్లిదండ్రులు కూడా పిల్లలకు అలాంటి ఫుడ్ నే పెట్టడానికి ఇష్టపడతారు. ఒకవేళ మీ పిల్లలకు ఈ అలవాటుంటే వెంటనే మాన్పించండి. దీనికి బదులుగా పౌష్టికాహారాన్ని పెట్టండి. ఇది వారి బరువును నియంత్రిస్తుంది. అలాగే వారిని హెల్తీగా ఉంచుతుంది. అలాగే పిల్లలకు ఆయిలీ ఫుడ్ ను తక్కువగా ఇవ్వండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలకు ఒకేసారి ఎక్కువగా ఫుడ్ ను పెట్టకూడదు. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు పెట్టండి. అలాగే నీటిని పుష్కలంగా తాగేలా చూడండి. 

ఆటలు ఆడించండి..

పిల్లలు బరువు తగ్గేందుకు అవుట్ డోర్ గేమ్స్ బాగా ఉపయోగపడతాయి. వాలీబాల్, ఫుట్ బాల్, బెట్ బాల్ వంటి ఆటలు ఆడేలా వారిని ప్రోత్సహించండి. ఈ గేమ్స్ వల్ల పిల్లలు వేగంగా బరువు తగ్గుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అవుట్ డోర్ గేమ్స్ ను ఆడించడం వల్ల గాడ్జెట్ తో గడిపే సమయం కూడా తగ్గుతుంది. మీకు తెలుసా.. రోజంతా పిల్లలు ల్యాప్ టాప్, కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. కాబట్టి మీ అవుట్ డోర్ గేమ్స్ ఆడేలా వారిని ఎంకరేజ్ చేయండి. 

గ్యాడ్జెట్ సమయాన్ని తగ్గించండి

ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అవుట్ డోర్ గేమ్స్ ఆడటానికి బదులుగా టీవీలు, ఫోన్ లు, ల్యాప్ టాప్ తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. పిల్లల్ని ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోబెట్టినా ఊబకాయం బారిన పడుతున్నారు. ఎందుకంటే పిల్లలు ఒకే చోట కూర్చొని తినడం వల్ల వారి శరీర బరువు వేగంగా పెరుగుతుంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తినేటప్పుడు టీవీ ని చూపిస్తారు. లేదా ఫోన్ చూపిస్తారు. దీనివల్ల పిల్లలు ఎక్కువగా తినే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఊబకాయానికి కూడా దారితీస్తుంది. అందుకే బిడ్డ వయస్సును బట్టి ఆహారం ఇవ్వండి. 

undefined

వ్యాయామం, యోగా

పిల్లలు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు యోగా, వ్యాయామం ఎంతో సహాయపడతాయి. రెగ్యులర్ గా మీ పిల్లలను పార్కుకు తీసుకెళ్లి తేలికపాటి వ్యాయామాలను చేయించండి. ఇవి వారిని మరింత హుషారుగా చేస్తాయి. 
 

పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించండి

బరువు పెరగడం వల్ల పిల్లలకు ఎన్నో రకాల రోగాలొచ్చే ప్రమాదముంది. కాబట్టి మీ పిల్లలకు హెల్తీ ఫుడ్స్ నే పెట్టండి.  ఏ ఆహారం మంచిదో.. ఏది చెడ్డదో.. అర్థమయ్యేలా చెప్పండి. ఏవేవి బరువు పెరిగేందుకు దారితీస్తాయోనన్న విషయం కూడా వివరించండి. 

click me!