మాట తప్పి ఎంజాయ్ చేస్తున్న గురు శిష్యులు... సాయం అంటూ రైతుల వేడుకోలు, చేతులు దులుపుకున్నట్లేనా?

Published : May 01, 2024, 08:52 AM IST

గురు శిష్యులు పల్లవి ప్రశాంత్-శివాజీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సాయం చేయడం లేదు. ఆపదలో ఉన్న కొందరు ఆదుకోవాలని వీరిని వేడుకుంటున్నారు.   

PREV
16
మాట తప్పి ఎంజాయ్ చేస్తున్న గురు శిష్యులు... సాయం అంటూ రైతుల వేడుకోలు, చేతులు దులుపుకున్నట్లేనా?
Bigg boss fame Pallavi Prashanth

మాట ఇవ్వడం తేలిక... దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో పెద్ద హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీగా వచ్చిన మొత్తాన్ని పేద రైతులకు పంచుతాను అన్నాడు. ఇది ఆయనకు ప్లస్ అయ్యింది. 
 
26
Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్ కష్టపడి గేమ్ ఆడాడు. అదే సమయంలో రైతుబిడ్డ ట్యాగ్, రైతులకు సహాయం చేస్తానన్న హామీ కలిసొచ్చాయి. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ విన్నర్ అయ్యాడు. ప్రైజ్ మనీగా పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షలు వచ్చాయి. 
 
36

నిబంధనల ప్రకారం ప్రైజ్ మనీలో అధిక మొత్తం టాక్స్ ల రూపంలో కట్ అవుతుంది. కాబట్టి రూ. 35 లక్షలకు గాను రూ. 16 లక్షలు పల్లవి ప్రశాంత్ కి వస్తాయి. ఈ మొత్తాన్ని అతడు పేద రైతులకు పంచాల్సి ఉంది. బిగ్ బాస్ షో ముగిసి దాదాపు ఐదు నెలలు అవుతుంది. 
 
46
Pallavi Prashanth - Sivaji

పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకు రూ. 1 లక్ష సహాయం చేశాడు. తల్లిదండ్రులు మరణించిన ఇద్దరు చిన్నారుల పేరిట లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. అలాగే ఒక ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. గురువు శివాజీ చేతుల మీదుగా లక్ష రూపాయలు వారికి అందించారు. 
 
56
Bigg boss fame Pallavi Prashanth

మొదటి సహాయం చేసి పల్లవి ప్రశాంత్ చాలా రోజులు అవుతుంది. మరో సహాయం చేయలేదు. శివాజీ, పల్లవి ప్రశాంత్ తరచుగా కలుస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. సదరు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల క్రింద పలువురు సహాయం కావాలని కామెంట్స్ చేస్తున్నారు. 

66

click me!

Recommended Stories