పచ్చి మిరపకాయలను దాదాపు అందరు ఇళ్లల్లో వాడుతూనే ఉంటారు. దాదాపు ప్రతి వంటలోనూ పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూనే ఉంటాం. చాలా రకాల కూరల్లో కారం కంటే.. మిరపకాయలు ఉపయోగించడం వల్లే రుచి మరింత పెరుగుతుంది. దాదాపు అందరూ పచ్చి మిరపకాయలను కేవలం కారం కోసం మాత్రమే వాడతారు. కానీ.. దీనిలోనూ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి6, ఐరన్, కాపర్, పొటాషియం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.