ఎండాకాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | May 1, 2024, 9:53 AM IST

ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీనివల్ల ఇళ్లు మొత్తం నిప్పుల కుంపటిలా మారిపోతుంటుంది. అయితే కొన్ని మొక్కలతో మీ ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. అవును కొన్ని రకాల మొక్కలు ఇంట్లో వేడిని తగ్గిస్తాయి. 
 

ఎండాకాలంలో ఇంట్లో ఉండటం కష్టమే. ఎందుకంటే మండుతున్న ఎండలకు ఇళ్లంతా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఏసీ ఇన్ స్టాల్ చేసుకోలేని ఇళ్లల్లోనే వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఏసీ పొద్దంతా ఆన్ చేయడం వల్ల కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. ఇంతింత కరెంట్ బిల్లులను కట్టలేని వారు ఏసీ ఉన్నా కూడా ఆన్ చేయరు. అలాగని ఇంట్లో ఉక్కపోతలకు కూడా ఉండలేం. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు ఏసీ లేకున్నా ఇంట్లో చల్లగా ఉండొచ్చు. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో వేడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..?
 

అలోవెరా మొక్క

అలొవేరా మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మనం ఎన్నో రకాల ఉపయోగించుకోవచ్చు. ఈ మొక్కను ఉపయోగించి ఇంట్లో వేడిని కూడా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీ గదిలో ఒక చిన్న కలబంద మొక్క కుండిని పెట్టండి. ఈ మొక్క మీ గది ఉష్ణోగ్రతను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కలబంద గాలిలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. దీంతో మీ గది చల్లగా ఉంటుంది.
 

Latest Videos


rubber plant

బేబీ రబ్బరు మొక్క

బేబీ రబ్బరు మొక్కలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అంతేకాదు ఈ మొక్కలు గదిని చల్లగా ఉంచడానికి, వేడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ మొక్కను గదిలో ఉంచితే అది గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది ఆక్సిజన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఈ మొక్కను ఎండాకాలంలో ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి. 
 

అరెకా పామ్ ట్రీ ప్లాంట్

అరెకా పామ్ ట్రీ కూడా గదులను చల్లగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది గాలిని తేమగా ఉంచడానికి పనిచేస్తుంది. ఈ మొక్కను ఎండాకాలంలో ఇంట్లో పెట్టుకుంటే మీ ఇల్లు ఏసీ లాగే చల్లగా ఉంటుంంది. ఈ మొక్కను మీరు లివింగ్ రూమ్ లో పెట్టొచ్చు. 
 

ఫెర్న్ ప్లాంట్

గాలిలో తేమను నిలుపుకోవడానికి ఈ మొక్క చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ మొక్క మీ ఇంటిని సహజ పద్ధతిలో చల్లగా ఉంచుతుంది. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫెర్న్ మొక్కను మే నుంచి సెప్టెంబర్ వరకు మీ గదిలో ఉంచాలి.

స్నేక్ ప్లాంట్

మీ ఇంటిని ఏసీ లాగ చల్లగా ఉంచాలనుకుంటే మీ ఇంట్లోపాము మొక్కను ఉంచండి. ఈ మొక్క రాత్రిపూట ఆక్సిజన్ ను ఇస్తుంది. దీని సహాయంతో మీ గది రాత్రిపూట వేడిగా కాకుండా చల్లగా ఉంటుంది. 
 

click me!