Weight Loss Tips: కివి పండు కూడా బరువును తగ్గిస్తుందా..?

First Published Aug 15, 2022, 3:48 PM IST

Weight Loss Tips: కివి పండులో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఓవర్ వెయిట్ ను తగ్గించడమే కాదు బెల్లీ ఫ్యాట్ ను కూడా ఫాస్ట్ గా కరిగిస్తుంది. 
 

కివి పండు ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా నిండి ఉన్నాయి. అందరికీ నచ్చే ఈ పండు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణురాలు లవ్నీత్ బాత్రా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈమె ప్రకారం.. ఈ పండు మనకు ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

దీనిలో ముఖ్యమైన ఖనిజాలు, వివిధ రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందని ఆమె అంటున్నారు.

ఈ పండులో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇక దీనిలో ఉండే అధికంగా ఉండే ఫోలేట్ హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది

ఈ పండులో విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాల్షియం శోషణకు, రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. 

కివి పండులో ఉండే ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే తిన్న ఆహారం తొందరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. దీనిలో తొందరగా జీర్ణం కావడానికి సహాయపడే ప్రోటీన్-కరిగే ఎంజైమ్ అయిన ఆక్టినిడిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 
 

కివి సెరోటోనిన్ మంచి మూలం. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. కివిని తినడం వల్ల మీరు అర్థరాత్రుళ్లు మేల్కొనే సమయం తగ్గుతుంది. ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. 
 

కివిలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

kiwi fruit

కివి పండులో మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఇ లు కూడా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ కె ఎముకలను బలంగా, పటిష్టంగా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. 

ఈ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది గొప్ప పండు అని నిపుణులు అంటున్నారు. దీనిని స్నాక్స్ గా తీసుకోవచ్చు. 

ఈ పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. బరువును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది బెల్లీ ఫ్యాట్ ను చాలా ఫాస్ట్ గా కరిగిస్తుంది. ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. 

click me!