ఏపీ సీఎం జగన్ కి కూడా ఫండింగ్ చేశా, చంద్రబాబుకు నేనే ఎదురు డబ్బులిచ్చా

First Published Apr 25, 2024, 12:20 PM IST

చంద్రబాబు నాకు డబ్బులు ఇవ్వడం కాదు. నేను చంద్రబాబుకు డబ్బులిస్తా.   బాబు గారికి ఫండింగ్ చేస్తున్నా. 

నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ప్రతినిధి 2’. 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.  మళ్లీ ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు నారా రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు ప్రముఖ జర్నలిస్ట్, టీవీ5 మూర్తి దేవగుప్తాపు. 

 ఇన్నాళ్లూ న్యూస్ ప్రజంటర్‌గా  పేరు తెచ్చుకున్న టీవీ5 మూర్తి ప్రతినిధి 2తో దర్శకుడి అవతారం ఎత్తారు. ఈ క్రమంలో ఈ పొలిటికల్ సినిమాపై రకరకాల విమర్శలు మొదలయ్యాయి.  ప్రతినిధి 2 సినిమాకు ఫండింగ్‌ అంతా చంద్రబాబు నాయుడిదే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీవీ5 మూర్తి. ప్రతినిధి 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇచ్చిన జర్నలిస్ట్ మూర్తి సంచలన కామెంట్స్ చేశారు.

TV5 Murthy

టీవీ 5 మూర్తి మాట్లాడుతూ.... "చంద్రబాబు నాకు డబ్బులు ఇవ్వడం కాదు. నేను చంద్రబాబుకు డబ్బులిస్తా. హెరిటేజ్ పాల ప్యాకెట్స్ రెండు కొంటాను. అలా బాబు గారికి ఫండింగ్ చేస్తున్నా. ఒకడిపై ఆధారపడే బతుకు నాది కాదు. నేనే వాళ్లకిస్తా. పవన్ కల్యాణ్ గారికి కూడా నేనే డబ్బులిస్తా. పవన్ కల్యాణ్ సినిమా వచ్చినప్పుడు 150 రూపాయలను పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా. అలా ఫండింగ్ చేస్తా" అని డైరెక్టర్ మూర్తి ఇంట్రస్టింగ్ గా సెటైరిక్ గా  కామెంట్స్ చేశారు.

 అలాగే "నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఏపీ సీఎం జగన్ గారికి కూడా ఫండింగ్ చేశా. భారతీ సిమెంట్ బస్తా 350 రూపాయలు. ఎవడికైనా నేనే డబ్బులిస్తా కానీ, నేను డబ్బులు తీసుకోను. నా చేయి పైనే ఉంటుంది. కింద ఉండదు" అని చెప్పుకొచ్చారు ప్రతినిధి 2 మూవీ డైరెక్టర్, జర్నలిస్ట్ మూర్తి. దీంతో ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

 ఈ క్రమంలో ప్రతినిధి 2 ఎజెండా గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ... "ప్రతినిధి 1 ఎజెండా వ్యవస్థని ప్రశ్నించడం. అందులో ఏ పార్టీని టార్గెట్ చేయలేదు. ప్రతినిధి 2 ఎజెండా కూడా అదే. అయితే ప్రతినిధి1లో సిస్టం బయట నుంచి ప్రశ్నిస్తాడు. ఇందులో సిస్టం లోపల ఉండి ప్రశ్నిస్తాడు" అని డైరెక్టర్ మూర్తి వివరించారు.
 

తన ఎక్సపీరియన్స్ గురించి చెప్తూ... "నాకు మొదటి నుంచి సినిమాపై ఆసక్తి ఉంది. కాలేజ్ డేస్‌లో నాటకాలు కూడా వేసేవాళ్లం. రోహిత్ గారిని ఓ సందర్భంలో కలిశాను. అప్పటికే నా దగ్గర నాలుగైదు కథలు ఉన్నాయి. అయితే, ఆయన ప్రతినిధి చూశాను. నేను రాసుకున్న ఈ కథలో ఆయన హీరోగా అయితే బాగుంటుంది అని అనిపించింది. ఆయన వాయిస్ ఈ కథకి మరింత బలం చేకూర్చుతుంది. రోహిత్ గారు సెటిల్డ్ నటుడు. మంచి చదువరి. వాయిస్ కల్చర్ అద్భుతంగా ఉంటుంది. ఈ కథకు ఆయన పర్ఫెక్ట్" అని మూర్తి తెలిపారు.

Prathinidhi 2

మరో ప్రక్క 'ప్రతినిధి 2' విడుదల వాయిదా వేశామని, కొత్త విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేస్తామని చిత్ర  టీమ్ పేర్కొంది.  'ప్రతినిధి 2' వాయిదాకి గల కారణాలు టీమ్ వెల్లడించలేదు. అందుకు కారణం సెన్సార్ ఆఫీసర్ లీవ్ లో ఉండటం వలన సెన్సార్ కాలేదని అందుకే వాయిదా పడిందని వినికిడి. మరో ప్రక్క వాయిదా పడటం వెనుక రాజకీయం ఉందని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. 
 

నారా రోహిత్  కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  స్వయానా పెదనాన్న. అందుకని, ఈ సినిమా ఖచ్చితంగా తెలుగుదేశం  పార్టీకి అనుకూలంగా సినిమా తీసి వుంటారని ప్రత్యర్థి పార్టీ నాయకులు, వాళ్ల అనుచరులు సినిమా సెన్సార్ అవకుండా  తెర వెనుక చక్రం తిప్పారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి.   విడుదల వాయిదా వెనక అసలు నిజం ఏమిటనేది తెలియాల్సి ఉంది. 

ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.  ట్రైలర్ లో జాతిపిత మహాత్మా గాంధీ మరణించినప్పుడు ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారని వేసిన ప్రశ్న ప్రత్యర్ది పార్టీ అధినేత తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాలకు సూటిగా తగిలిన ప్రశ్నగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఏపీలో ఎన్నికల వాతావరణం నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడిందని చెప్తున్నారు. కొన్ని రోజులపాటు విడుదల వాయిదా వేశామని.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది టీం.

సమకాలీన రాజకీయాలపై ప్రశ్నలు సంధించే సమస్య పరిష్కారం దిశగా పక్కా పొలిటికల్‌ జోనర్‌లో రాబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌.  ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పొలిటీషన్ తన పవర్ తో  ..ఓ మీడియా జర్నలిస్ట్ ని టార్గెట్ చేస్తే అతను అన్ని దాటుకుని తనేంటో చూపటమే ఈ సినిమా కథాంశం అంటున్నారు. దర్శకుడు మూర్తి తన నిజ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లలను,వేధింపులను ఈ సినిమాలో చూపాడంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఓ వర్గాన్ని ప్రభావితం చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు.  ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

hero Nara Rohit

నారా రోహిత్ హీరోగా నటించిన 'ప్రతినిధి 2' సినిమాలో సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిష్షు సేన్‌ గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృథ్వీ రాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), రఘు బాబు, రఘు కారుమంచి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కళా దర్శకత్వం: కిరణ్ కుమార్ మన్నె, స్టంట్స్: శివ రాజు - పృథ్వీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కార్తీక్ పుప్పాల, సంగీతం: మహతి స్వర సాగర్, నిర్మాణ సంస్థలు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ - రానా ఆర్ట్స్, నిర్మాతలు: కుమార్‌ రాజా బత్తుల - ఆంజనేయులు శ్రీ తోట - సురేంద్రనాథ్ బొల్లినేని, దర్శకకుడు: మూర్తి దేవగుప్తపు.
 

click me!