కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. వీటిని లైట్ తీసుకుంటే మీ పని అంతే..

First Published Aug 13, 2022, 2:08 PM IST

మూత్రపిండాల్లో ఏదైనా సమస్య ఏర్పడితే.. మన  శరీరం ఎన్నో రకాలుగా ఆ సమస్యను తెలియజేస్తుంది. ఎందుకంటే టాక్సిన్స్ శరీరంలోపల పేరుకుపోతాయి. అందుకే ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకూడదు.
 

మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో మూత్రపిండాలు ఒకటి. ఎందుకంటే ఇవి రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రక్తం స్వచ్ఛంగా ఉండేలా చేస్తుంది. అయితే మూత్రపిండాల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా.. మన శరీరం ఆటోమెటిక్ దాని లక్షణాలను వివిధ రూపాల్లో తెలియజేస్తుంది.

మూత్రపిండాల వైఫల్యం, మూత్రపిండాల సంక్రమణతో  ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే ఈ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేయకూడదు. మూత్రపిండాల ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అలసట

మూత్రపిండాల వడపోత పనికి అడ్డంకి  ఏర్పడితే.. శరీరంలో విషపదర్థాలు పేరుకుపోవడం మొదలవుతుంది. ఈ కారణంగా శరీరంలో బలహీనపడుతుంది. అలాగే అలసట కూడా వస్తుంది. 
 

నిద్రలేమి

మూత్రపిండాల్లో ఏదైనా సమస్య ఏర్పడితే నిద్రవేలలకు భంగం కలుగుతుంది.  అంటే ఇది నిద్రలేమికి కారణమవుతుంది. ఇలాంటి సమస్య వస్తే.. వైద్యులను తప్పక సంప్రదించండి. 
 

దురద

మూత్రపిండాల పనితీరుకు ఆటంకం కలిగితే.. రక్తంలో విషపదార్థాలు శరీరంలో అలాగే పేరుకుపోతాయి. దీనివల్ల చర్మంపై దురద పెడుతుంది. 
 

మూత్రం రంగులో మార్పులు

మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే.. శరీరంలో ఉన్న ప్రోటీన్ బయటకు వస్తుంది. దీంతో మీ మూత్రం గోధుమ లేదా పసుపు రంగులో వస్తుంది. కొన్ని సందర్భంలో మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు మూత్రంలో రక్తం వస్తుంది. అలాగే మూత్రం నురుగు వస్తుంది.

ముఖం, పాదాలలో వాపు

మూత్రపిండాలు దెబ్బతింటే.. అవి సోడియంను శరీరం తొలగించలేదు. దీంతో సోడియం లెవెల్స్ బాగా పేరుకుపోతాయి. దీంతో ముఖం, పాదాలు వాపు వస్తాయి.
 

కండరాల్లో తిమ్మిరి

మూత్రపిండాలు దెబ్బతింటే కండరాళ్లో, కాళ్లలో తిమ్మరి ఏర్పడుతుంది. ఎందుకంటే మూత్రపిండాలు వర్క్ చేయకపోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్లు, సోడియం, పొటాషియం, కాల్షియం లెవెల్స్ పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. 
 

kidney


శ్వాస ఆడకపోవడం

తరచుగా శ్వాస తీసుకోవడంలో మీరు ఇబ్బంది పడుతుంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది మూత్రపిండాల వ్యాధి లక్షణం కాబట్టి. అందుకే  ఇలాంటి లక్షణం కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించండి. 

click me!