అత్యద్భుతమైన అరకును చూడడానికి అదిరిపోయే irctc ప్యాకేజి...

First Published Jul 17, 2021, 4:43 PM IST

హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ వచ్చినవారు అరకు వెళ్లాలనుకుంటే  IRCTC వైజాగ్-అరకు హాలిడే టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.

అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC టూర్ ప్యాకేజీని ప్రకటించింది. విశాఖపట్నం నుంచి అరకు టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
undefined
హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ వచ్చినవారు అరకు వెళ్లాలనుకుంటే ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. టూరిస్టులు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ చేరుకున్న తర్వాత టూర్ ప్యాకేజీ మొదలవుతుంది. ఈ ప్యాకేజీలో వైజాగ్, అరకులోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది.
undefined
ఈ టూర్ ఎలా కొనసాగుతుందో తెలుసుకోండి.Day 1:పర్యాటకులను వైజాగ్ ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ దగ్గర ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, రామానాయుడు ఫిలిమ్ స్టూడియో, రుషికొండ బీచ్ సందర్శించొచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత కైలాసగిరి, సబ్‍మెరైన్ మ్యూజియం, బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ సందర్శించొచ్చు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.
undefined
Day 2:రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అరకు బయల్దేరాలి. దారిలో తైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం సందర్శించాలి. మధ్యాహ్న భోజనం తర్వాత అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ సందర్శించొచ్చు. సాయంత్రం తిరిగి విశాఖపట్నం బయల్దేరాలి. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.
undefined
Day 3:మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పర్యాటకులను విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.సుందరమైన ప్రకృతి రమణీయమైన ప్రాంతాలను చూసి, వాటి తాలూకు జ్ఞాపకాలను మీ మనసులో నింపుకొని నూతనోత్సాహంతో మీ దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోవడానికి మీ సొంతూరికి పయనమవ్వండి.
undefined
ఐఆర్‌సీటీసీ వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ ప్రారంభ ధర రూ.6,160. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8610, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.15,730 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి పికప్ అండ్ డ్రాప్, రెండు రాత్రులు విశాఖపట్నంలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, ప్యాకేజీ బుక్ చేయడానికి https:www.irctctourism.com వెబ్‌సైట్ చూడండి.
undefined
click me!