వినేష్ ఫోగట్ ఏం చదువుకుందో తెలుసా?

First Published | Aug 7, 2024, 5:32 PM IST

వినేష్ ఫోగట్ రెజ్లింగ్ లో ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లింది. ఖచ్చితంగా బంగారు పతకం సాధిస్తుంది అనుకున్న భారతీయలకు నిరాశే మిగిలింది. అయినా.. ఈమె ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. అసలు వినేష్ ఫోగట్ గరించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పదండి. 
 

50 కేజీల రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్‌కు రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఎంపికయ్యారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ అధిక బరువు కారణంగా బుధవారం నాడు ఈమెపై అనర్హత వేటు పడింది. కానీ ఇండియాకు రెజ్లింగ్ లో ఈమె ఖచ్చితంగా బంగారు పతకం తెస్తుందన్న ఆశ ప్రతి ఒక్కరికీ ఉన్నది. కానీ ఈ అనర్హత వేటు భారతీయుల్ని ఎంతో నిరాశకు గురి చేసింది. అయినా.. ఈమె ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ రెజ్లర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బాల్యం

వినేష్ ఫోగట్ ఆగస్టు 25, 1994న భారతదేశంలోని హర్యానాలో పుట్టారు. ఈమె మేనమామ మహావీర్ సింగ్ ఫోగట్ ఆమెకు చిన్న వయస్సులోనే కుస్తీకి పరిచయం చేశాడు.
 

Latest Videos



చదువు

ఆమె తన స్కూల్ చదువును ఝోజు కలాన్‌లోని KCM సీనియర్ సెకండరీ స్కూల్‌లో పూర్తి చేసింది. అలాగే రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకుంది. 

రెజ్లింగ్ కెరీర్

ఈమె తన చిన్నతనంలోనే రెజ్లింగ్ లోకి అడుగుపెట్టడంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికి వినేష్ ఫోగట్ వెనకడుగు వెయ్యలేరు. ఎన్ని సమస్యలు వచ్చినా.. వినేష్ రెజ్లింగ్‌లో తన వృత్తిని ఖచ్చితంగా కొనసాగించాలని నిశ్చయించుకుంది. అందుకే ఇంత వరకు వచ్చింది.
 

కెరీర్ హైలైట్స్

వినేష్ ఫోగట్ 2018 ఆసియా క్రీడలు, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు, అలాగే 2019 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో పాటుగా గొప్ప గొప్ప విజయాలను సాధించింది.
 

కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్

వినేష్ ఫోగట్ 2016, 2017, 2018లో మూడుసార్లు కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్రలో తన పేరును లిఖించుకుంది. 
 


పారిస్ ఒలింపిక్స్ 2024

వినేష్ ఫోగట్‌ను పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ లో అనర్హులుగా ప్రకటించారు. ఈమె 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఈమె భారత్ కు బంగారు పతకం గెలుచుకొస్తుంది అన్న నమ్మకం కూడా ప్రతి  ఒక్కరికీ ఉన్నది. కానీ ఈమె అధిక బరువు ఉందని అనర్హత వేటు పడింది. ఏదేమైనా వినేష్ ఫోగాట్ అంకితభావం, నిబద్ధత లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈమె ఎంతో మంది యువ మహిళా అథ్లెట్లకు రోల్ మోడల్‌గా నిలిచి చూపించింది. 

click me!