డేవిడ్ వార్నర్
ఐపీఎల్ క్రికెట్ సిరీస్ 18వ సీజన్ వచ్చే ఏడాది 2025లో జరగనుంది. 2025 సిరీస్‌కు ముందు సౌదీ అరేబియాలో ఆటగాళ్ల కోసం మెగా వేలం జరుగుతోంది. ఆదివారం జరిగిన వేలంలో పలువురు ప్రముఖ ఆటగాళ్లు రికార్డు స్థాయి వేలంతో సంచలనం సృష్టించారు. భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను లక్నో జట్టు రూ.27 కోట్లకు, మరో యాక్షన్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.26.75 కోట్లకు దక్కించుకుంది.
డేవిడ్ వార్నర్
అయితే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాట్స్ మెన్లలో ఒకరైన వార్నర్ కు బిగ్ షాక్ తగిలింది. వార్నర్ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. వార్నర్ భాయ్ కి ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ లో చోటుదక్కకపోవడం అందరికీ షాక్ ఇచ్చింది.
డేవిడ్ వార్నర్
జెడ్దాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలం 2025 లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ని ఏ జట్టు కొనలేదు. మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్. తన జట్టును ఒకసారి ఛాంపియన్ గా కూడా నిలబెట్టిన కెప్టెన్. ధనాధన్ బ్యాటింగ్ తో సంచలన ఇన్నింగ్స్ లను కూడా ఆడాడు. కానీ, అతన్ని కోనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.
డేవిడ్ వార్నర్
దీనికి ప్రధాన కారణంగా డేవిడ్ వార్నర్ గత సీజన్ లో (ఐపీఎల్ 2024) ఢిల్లీ తరపున ఎనిమిది మ్యాచ్ లలో కేవలం 168 పరుగులు చేశాడు. సగటు 21 మాత్రమే. రెండో రోజు వేలంలో అతనిని కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చు.
డేవిడ్ వార్నర్
ఐపీఎల్ లో వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్, స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కు ఐపీఎల్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. సూపర్ బ్యాటింగ్ తో పరుగుల వరద పారించిన ప్లేయర్.
38 ఏళ్ల వార్నర్ 184 మ్యాచ్ లలో 40.52 సగటుతో 6565 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కావడం విశేషం.