గౌతమ్ పై పగ తీర్చుకున్న యష్మీ, ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ కూడా వదలలేదుగా

First Published | Nov 24, 2024, 11:53 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వీకెండ్.. మరో ఎలిమినేషన్. అయితే ఈసారి మాత్రం షాకింగ్ ఎలిమినేషనర్ జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న యష్మి హౌస్ ను వీడి వెళ్ళిపోవలసి వచ్చింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఈసారి జరిగిన నామినేషన్లు చాలా టఫ్ అనే చెప్పాలి. ఎందుకుంటే నామినేషన్లలో ఉన్నది అంతా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు. దాంతో ఎవరు ఎలిమినేట్ అయ్యివెళ్ళిపోతారా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు.  అయితే అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్  నుంచి యష్మి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. అసలు అంతా యష్మి టాప్ 5 లోకి వస్తుంది అని అనుకున్నారు. కాని యష్మి ఇలా వెళ్ళిపోవడం  చాలామందికి షాక్ ఇచ్చింది. 

అయితే గత రెండు మూడు వారాలు గా యష్మి, నిఖిల్ కు సబంధించిన వివాదం.. ఆమెపై బాగా నెగెటివిటీని తీసుకువచ్చింది. అంతే కాదు బయట నుంచి హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు.. ఈ వారం నామినేషన్స్ లో యష్మిని గట్టిగా టార్గెట్ చేశారు. నిఖిల్ విషయంలో ఆమెను హెచ్చరించడంతో పాటు.. ఆమె లోపాలు కూడా వెల్లడించారు. దాంతో అది నిఖిల్ కు మైనస్ అవుతుంది అని అనుకున్నారు. 
 


కాని డైరెక్ట్ గా ప్రభావం యష్మిపైనే పడింది. దాంతో ఆమె ఎలిమినేషన్ తప్పలేదు. ఇక ప్రతీవారం నామినేట్ అవుతూ వస్తూ..  సేవు అవుతూ వస్తున్న పృధ్వీ మాత్రం ఆసారి ఎలిమినేషన్ అంచుల వరకూ వెళ్ళాడు. యష్మితో పాటు సెకండ్ ఆప్షన్ గా పృధ్వీ ఉన్నాడంటే అతనికి కూడా తక్కువ ఓట్లు పడ్డటే కదా సో ఈరెండు వారాలు అతను జాగ్రత్తగా లేకపోతే.. ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. 

సో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న యష్మి, ప్రేరణ, నిఖిల్, పృధ్వీ. నబిల్,  లలో శనివారం నిఖిల్ సేవ్ అయ్యాడు. ఇక ఈరోజు వరుసగా ప్రేరణ, నబిల్ సేవ్ అవ్వగా.. ఆతరువాత యష్మి ఎలిమినేట్ అయ్యి,.. పృధ్వీ సేవ్ అయ్యాడు.  ఇక వెళ్తూ వెళ్తూ.. యష్మి చాలా తెలివిగా సమాధానాలు చెప్పింది. జర్నీ చూసిన తరువాత ఇంట్లో ఎవరు ఫ్రెండ్స్ నీకు ఎవరు ఎనిమీస్ అని బోర్డ్ మీద ఫోటోలు పెట్టమన్నారు నాగ్. 

దాంతో ముందు ప్రేరణ, ఆతరువాత నిఖిల్, పృధ్వీ పేర్లు పెట్టిన యష్మి.. వెంటనే విష్ణు ప్రియ పోటో కూడా తీసుకుంది. గతంతో విష్ణుపై నెగెటీవ్ గా మాట్లాడి.. పృధ్వీకి దూరం చేసిన ఆమె.. ఇప్పుడు తమ కే బ్యాచ్ లోకి విష్ణుని కూడా తీసుకుంది. బోర్డ్ పైన ఫ్రెండ్స్ గా పెట్టిన వారిలో విష్ణు ప్రియా తప్పించి అందరు కన్నడ బ్యాచ్ కావడం విశేషం. 
 

ఇక శత్రువలుగా ఫోటోలు తగిలిస్తూ.. వారు శత్రులు మాత్రం కాదు.. కాని సజెషన్స్ కోసమే పెడుతున్నా అంటూ.. గౌతమ్., అవినాశ్, రోహిణి ఫోటోలు శత్రుల లిస్ట్ లో పెట్టింది యష్మి. ఇక అసలు ఆట ఇప్పుడే ఆడింది యష్మి. నిన్న స్నేక్ గేమ్ లో ఎక్కువ స్నేక్ లు వచ్చిన నిఖిల్, గౌతమ్ లలో ఎవరి మీద బిగ్ బాంబ్ వేస్తావు అని అడిగితే గౌతమ్ మీద అని చెప్పింది యష్మి. 

అది కూడా బిగ్ బాంబ్ ఒక నామినేషన్ పడినట్టు లెక్క. నిఖిల్ ఆల్ రెడీ ఈ వీక్ నామినేట్ అయ్యి..  సేవ్ అయ్యాడు. సో గౌతమ్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేడు కాబట్టి.. ఈవీక్ నామినేట్ చేస్తున్నా అని యష్మి చెప్పింది. దాంతో గౌతమ్ ఫేస్ లో మార్పు కనిపించింది. అలా వెళ్తూ.. వెళ్తూ.. కామ్ గా గౌతమ్ పై తన పగను తీర్చుకుంది యష్మి. 

Latest Videos

click me!