వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: 4 ఉడికించిన బంగాళాదుంపలు (Potatoes), వంట నూనె (Oil),1/2కప్పు పన్నీర్ (Pannier), 1/2 క్యాప్సికం (Capsicum), క్యారెట్ (Carrot), క్యాబేజ్ (Cabbage), ఉల్లిపాయలు (Onion), కారం పొడి (Mirchi powder),1స్పూన్ చాట్ మసాలా (Chat masala),1స్పూన్ గరం మసాలా పొడి (Garam masala), రుచి సరిపడా ఉప్పు (Salt),1 కప్పు గోధుమ పిండి (Wheat flour), టమోటా సాస్ (Tomato sauce), గ్రీన్ చిల్లీ సాస్ (Green chilli sauce).
తయారీ విధానం: రోటి తయారీ విధానం కోసం ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి (Wheat flour) తీసుకొని అందులో కొంచెం ఉప్పు (Salt), నూనె (Oil) వేసి పిండిని చపాతీ పిండిలా మెత్తగా కలపాలి. ఇలా తయారుచేసుకున్న పిండిని ఒక తడి గుడ్డ లో ఉంచి పక్కన ఉంచాలి. .
ఇప్పుడు మసాలా తయారీకి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కొంచెం నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, సన్నగా తరిగిన క్యాబేజ్ (Cabbage), క్యారెట్ (Carrot) ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప(Boiled potatoes) ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత పన్నీర్ (Pannier) ముక్కలు వేయాలి.
రెండు నిమిషాల తర్వాత తగినంత కారం (Mirchi powder) సరిపడు ఉప్పు (Salt), చాట్ మసాలా (Chat masala), గరం మసాల (Garam masala) వేసి కలపాలి. సన్నని మంట (Sim flame) మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచాలి.
రోటీ తయారీ కోసం పిండిని చపాతీ లాగా పలుచగా చేయాలి. స్టవ్ మీద తవా ఉంచి వేడయ్యాక రోటీని వేసి నూనె (Oil) వేస్తూ చపాతీ లాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న రోటీ పైన మొదట టమోటా సాస్ అప్లై చేయాలి. రోటి మధ్యభాగంలో తయారు చేసుకున్న మసాలా (Masala) ఉంచాలి.
సన్నగా తరిగిన క్యాబేజీ (Cabbage), ఉల్లిపాయ (Onion) ముక్కలను మసాలా మీద ఉంచాలి. తర్వాత దీని మీద గ్రీన్ సాస్ అప్లై చేయాలి. రోటి పైభాగాన్ని, కింది భాగాన్ని మడవాలి. ఇప్పుడు రోటీని పొడవుగా ఒక వైపు నుంచి మరొక వైపుకు చుట్టాలి. రోల్ చేసిన ఈ రోటీని టిష్యూ పేపర్ తో కవర్ చేయాలి.
ఈ రోల్ ను ఒక ప్లేట్ లో ఉంచి టమోటా సాస్ (Tomato sauce) తో సర్వ్ చేయండి. అంతే నోరూరించే హెల్తీ (Healthy) వెజ్ స్ప్రింగ్ రోల్ రెడీ. ఇంకేంటి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి మీ పిల్లలకు తినిపించండి.