వాస్తు ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఉంచాలి.. వాస్తు బాలేకపోతే వచ్చే అనర్ధాలు ఏంటో తెలుసా?

First Published Dec 2, 2021, 2:54 PM IST

సొంత ఇల్లు అయినా, అద్దె ఇల్లు అయినా వాస్తు సరిగా ఉండాలి. ముఖ్యంగా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వాస్తు చూసి ఇంటి నిర్మాణం చేపట్టడం మంచిది. ఇలా ఇంటి వాస్తు సరిగా లేకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంటి వాస్తు సరిగా లేకపోతే, కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగటివ్ ఎనర్జీ (Negative energy) ఇంట్లోకి చేరి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఇంటి వాస్తు ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఉంచరాదు వాస్తు బాలేకపోతే వచ్చే అనర్ధాలు ఏంటో తెలుసుకుందాం..
 

కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే, వాస్తు సరిగా లేకపోతే మనం ఏ పని చేపట్టినా తగిన ఫలితం దొరకక నిరాశ చెందుతారు. అనేక ఆర్థిక సమస్యలకు (Financial problems) ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆర్థికపరంగా మెరుగు పడాలన్నా, అనుకున్న పనులు పూర్తి కావాలన్నా, ఇంట్లోని చికాకులు, ఆందోళన తగ్గి పోవాలన్నా ఇంటి వాస్తు సరిగా ఉండటం అవసరం. అయితే వాస్తు ప్రకారం ఏ వస్తువులు ఇంటిలో ఉంచరాదు వాటితో కలిగే అనర్ధాలు (Misfortunes) ఏంటో తెలుసుకుందాం..  
 

వాస్తు ప్రకారం ఈశాన్య దిశలో (Northeast direction) ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం వైపు అధిక బరువు పెట్టరాదు. నీరు మాత్రమే ఉండాలి. లేకుంటే అనేక మానసిక వ్యాధులు (Mental illnesses), వైకల్యం సమస్యలు ఎదురవుతాయి. వాస్తు ప్రకారం ఇంటిలో పగిలిన దేవుని విగ్రహాలు, అద్దాలు, ఫోటోలు, గడియారంను ఉంచరాదు. ఇలా ఉంచితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది.
 

ఇది ఇంటి సభ్యుల అనారోగ్యానికి కారణం అవుతుంది. ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా (Clean) ఉంచుకోవాలి. అప్పుడే ఇంటిలోకి అదృష్ట దేవత, లక్ష్మీ దేవత ప్రవేశిస్తుంది. లేకుంటే ఇంటిలో శని తాండవిస్తుంది. దాంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న పనులు జరగవు. ఇంటిలో కులాయి లీకేజీ (Tap Leakage) ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి. ఇంటి ప్రవేశ గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెట్టకూడదు. 
 

చనిపోయిన మొక్కలను తీసి పడేయాలి. పగిలిన అద్దంలో (Broken mirror) ముఖాన్ని చూసుకోరాదు. వీటి కారణంగా ఇంటి వ్యక్తులలో ఆందోళనలు, చికాకులు మొదలవుతాయి. జలపాతాల ఫోటోలను ఇంట్లో ఉంచరాదు. వీటి కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు (Conflicts) ఏర్పడతాయి. తూర్పు దిశలో భూగర్భ వాటర్ ట్యాంకు, బావి, బోరు ఉండరాదు. ఇలా ఉంటే తల్లి, కొడుకు ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది.
 

ఇంట్లో బెడ్రూంలో మంచాన్ని గోడకు ఆనించి ఉంచరాదు. ఇలా చేయడంతో ప్రాణశక్తి తగ్గుతుంది. మంచం కింద పాత వస్తువులు, చెప్పులు పెట్టరాదు. మంచానికి ఎదురుగా గడియారం (Clock), క్యాలెండర్లను (Calendars) అమర్చరాదు. మంచం మీద నలుపు, నీలం రంగు దుప్పట్లు వేయరాదు. ఇలా చేస్తే అదృష్టం కలిసి రాదు. ఏ పని చేపట్టినా విజయం లభించదు.

click me!