ఇంట్లోనే పావ్ భాజీ ఇలా ఓసారి ట్రై చేయండి.. ఇంట్లోవారితో మెప్పు పొందండి!

First Published Nov 5, 2021, 5:41 PM IST

ఎంతో రుచికరమైన ఈ పావ్ భాజీ మసాలాను (Pav bhaji masala) పిల్లలకు చేసి పెట్టారంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఇంట్లోనే సులభమైన పద్ధతిలో తక్కువ సమయంలో చేసుకునే ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం..
 

పావ్ భాజీ తయారీకి కావలసిన పదార్థాలు: ఆరు పావ్ బ్రెడ్ లు, 3 బంగాళదుంపలు (Potato), రెండు టమోటాలు (Tomato), 1 క్యాప్సికమ్ (Capsicum), అరకప్పు పచ్చి బఠాణీలు (Green peas), 2 ఉల్లిపాయలు (Onions), 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), 1 స్పూన్ గరం మసాలా (Garam masala).
 

పావు స్పూన్ పసుపు (Turmeric),1 స్పూన్ పావ్ భాజీ మసాలా (Pavbhaji masala), 1 స్పూను ధనియాలపొడి (Coriander powder), 3 టేబుల్ స్పూన్ ల వెన్న (Butter), కొత్తిమీర (Coriander), తగినంత కారం (red chilli powder), ఒక నిమ్మకాయ (Lemon).
 

తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను శుభ్రపరుచుకుని కుక్కర్ లో వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన బంగాళదుంపలను తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక టీ స్పూన్ వెన్న (Butter) వేసి వెన్న కరిగిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు, బఠాణీలు వేసి రెండు నిమిషాలు బాగా ఫ్రై (Fry) చేయాలి.
 

ఇప్పుడు సగం కప్పు సన్నగా తరిగిన టమోటో ముక్కలు (Chopped tomato) వేసి కలపాలి. మూత పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాలు సన్నని మంట (Low flame) మీద ఉడికించాలి. ఇలా టమోటా, క్యాప్సికం, బఠాణీలు బాగా ఉడికిన తరువాత దీన్ని మెత్తగా చిదుముకోవాలి. తరువాత ముందుగా ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళాదుంప మిశ్రమాన్ని, కారం, పావు బాజీ మసాలా, పసుపు, ఉప్పు, కోతిమీర ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి.
 

ఇలా పది నిమిషాలు తక్కువ మంట మీద బాగా ఉడికించాలి. ఇలా ఉడికించిన మిశ్రమాన్ని బాగా మెత్తగా చిదుముకోవాలి. మరొక పాన్ (Pan) లో 2 టేబుల్ స్పూన్ ల వెన్న వేసి కరిగిన తరువాత  పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై (Fry) అయిన తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
 

తర్వాత ఇందులో కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసి తక్కువ మంట (Low flame) లో బాగా కలపాలి. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న భాజీ మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఒక కప్పు నీళ్లు పోసి ఐదు నిమిషాలు బాగా ఉడికించాలి. మసాలా బాగా ఉడికి దగ్గర పడ్డాక కస్తూరి మేతి, కోతిమీర, నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. 
 

ఇప్పుడు పావ్ ను ఫ్రై చేసుకోడానికి ఒక పాన్ పెట్టి అందులో ఒక టీస్పూన్ బటర్ (Butter) వేసి కొంచెం కారం, కొత్తిమీర వేసి కలిపి ఇందులో సగం కట్ చేసిన పావ్ బ్రెడ్ (Pav bread) ను వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో బాజీ మిశ్రమాన్ని పావ్ ను పెట్టి సర్వ్ చేయండి. అంతే ఎంతో టేస్టీ అయిన పావ్ భాజీ రెడీ.

click me!