ఇయర్ ఫోన్స్ లో సాలీడు పురుగు.. చూసుకోకుండా చెవిలో పెట్టుకొని..

First Published Oct 15, 2020, 12:37 PM IST

ఇయర్ పోన్స్ పెట్టుకున్నప్పుడల్లా.. పాట వినేటప్పుడు అతనికి ఆటంకాలు ఎదురౌతున్నాయి.

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువయింది. ఈ క్రమంలో ఎవరి చెవుల్లో చూసినా ఇయర్ ఫోన్స్ ఉండటం సర్వసాధారణమైపోయింది.
undefined
కాగా.. ఓ యువకుడు కూడా ఇటీవల మార్కెట్లో పెద్ద ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. అయితే.. వాటిని వాడే క్రమంలో అతనికి వింత అనుభవం ఎదురైంది. అది చూసి అతను షాకయ్యాడు. అతను పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ లో పెద్ద సాలీడు పురుగు కనపడింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువకుడు ప్లంబర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను ఇటీవల ఓ పెద్ద ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. వాటిని చెవిలో పెట్టుకొని పెద్దగా సౌండ్ పెట్టుకొని సాంగ్స్ వినాలని అనుకున్నాడు.
undefined
అదే చేశాడు కూడా. అయితే.. ఇయర్ పోన్స్ పెట్టుకున్నప్పుడల్లా.. పాట వినేటప్పుడు అతనికి ఆటంకాలు ఎదురౌతున్నాయి.
undefined
సాంగ్ సరిగా వినిపించకపోగా.. అతని చెవిలో ఏదో చెక్కిలి గింతలు పెడుతున్నట్లుగా అనిపించసాగింది. ఫస్ట్ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఏంటా.. అని ఆ ఇయర్ ఫోన్స్ ఓపెన్ చేసి చూడగా.. అందులో ఉన్నది చూసి అతను షాక్ అయ్యాడు. ఆ ఇయర్ ఫోన్స్ లో పెద్ద సాలీడు పురుగు కనిపించింది.
undefined
ఈ విషయాన్ని అతను ఓ స్థానిక మీడియాకి తెలియజేయగా.. ఈ వార్త కాస్త వైరల్ గా మారింది.కాగా.. ఆ స్పైడర్ కనుక కుడితే.. చనిపోయే ప్రమాదం అయితే ఉండదని.. అయితే.. భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం మాత్రం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
కొత్తవి ఇయర్ ఫోన్స్, హెల్మెట్ కొనుగోలు చేసినప్పుడు వాటిని చెక్ చేసుకోవాలని.. లేదంటే.. వాటిల్లో ఒకవేళ పురుగులు లాంటివి ఉంటే.. ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!