టాలీవుడ్ యాంకర్స్ లో ఒకరైన గీతా భగత్ సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, మూవీ ప్రెస్ మీట్స్ ఇలా మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్ కి ఎక్కువగా ఆమే కనిపిస్తూ ఉంటారు. వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ షోని నడిపించడం ఆమె శైలి.