మన క్రికెటర్లు బాగా రిచ్ గురూ... టాప్ 10 శ్రీమంతులు వీళ్లే...

First Published | May 6, 2024, 10:23 AM IST

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ప్రపంచంలోనే ధనిక బోర్డు. అత్యధిక ఆదాయం కలిగిన బోర్డు తరపున ఆడుతున్న భారత ఆటగాళ్లు కూడా అదేస్థాయిలో సంపాదిస్తున్నారు. ఇలా అత్యధిక ఆస్తులు సంపాదించిన టాప్ 10 క్రికెటర్లు వీళ్లే... 

indian team

భారతీయులకు క్రికెట్ ఓ ఎమోషనల్ గేమ్. చిన్నపిల్లల నుండి వృద్దుల వరకు అందరూ క్రికెట్ అభిమానించేవాళ్లే. ఇక యువత అయితే క్రికెట్ అంటే పడిచస్తారు. భారత క్రికెటర్లను ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు... సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ  వంటి క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా తాము అభిమానించే ఆటగాళ్ల గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లలో అత్యంత శ్రీమంతులు ఎవరో తెలుసుకుందాం.  

Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్ : 

అభిమానులు ముద్దుగా గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. అయితే క్రికెట్ లోనే కాదు ఆదాయంలోనూ సచిన్ టాప్ లో వున్నాయి. అతడి ఆస్తుల విలువ రూ.1250 కోట్లకు పైగా వుంటుంది. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ధనిక ఆటగాళ్లలో సచిన్ ఒకరు. 


Virat Kohli

విరాట్ కోహ్లీ : 

ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. అతడికి బ్యాట్  తో పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలుగొట్టడమే కాదు డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలుసు. అతడు కేవలం క్రికెట్ నుండే కాదు యాడ్స్ రూపంలోనూ భారీ ఆదాయాన్ని పొందుతున్నాడు. అతడి ఆస్తుల విలువ రూ.1050 కోట్ల వరకు వుంటుంది.   

MS Dhoni

మహేంద్రసింగ్ ధోని : 

భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సంపాదించుకున్నారు మహేంద్రసింగ్ ధోని. టీమిండియా కెప్టెన్ గానే కాదు ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ సారధిగానూ ఎన్నో రికార్డుల ఆయన సొంతం. ఇలా తన ఆటతో కేవలం రికార్డులే కాదు భారీగా ఆదాయాన్ని కూడా పొందారు ధోని. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువు రూ.1040 కోట్లు. ఇలా ఫ్యాన్స్ నే కాదు డబ్బులు బాగానే సంపాదించాడు ధోని. 
 

Sourav Ganguly

సౌరవ్ గంగూలీ :

టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా భారీగా ఆస్తులు కలిగివున్నాడు . ఆయన ఆస్తుల విలువ రూ.498.9 కోట్లు. అయితే క్రికెటర్ గా కంటే వారసత్వంగా  వచ్చిన ఆస్తులే గంగూలీకి ఎక్కువగా వున్నాయి.  పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని అత్యంత ధనిక కుటుంబంలో గంగూలి జన్మించారు. 

Yuvraj Singh

యువరాజ్ సింగ్ :  

టీమిండియా క్రికెటర్లలో తప్పకండా గుర్తుండిపోయే పేర్లలో యువరాజ్ సింగ్ ఒకటి. అతడు ఓవర్ లోని ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డు సాధించాడు. ఇలా అద్భుతమైన క్రికెటర్ గా పేరు తెచ్చుకోవడమే కాదు ఆస్తులను కూడా కూడబెట్టాడు యువీ. అతడి ఆస్తుల విలువు రూ.291 కోట్లు. 
 

Rohit Sharma

రోహిత్ శర్మ :

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారీగా ఆస్తులను కలిగివున్నాడు. టీమిండియా, ఐపిఎల్ ద్వారానే కాదు ప్రకటనల ద్వారా రోహిత్ భారీగానే సంపాదిస్తున్నాడు. అతడు రూ.216 కోట్ల ఆస్తులను కలిగివున్నాడు.
 

Suresh Rain

సురేశ్ రైనా : 

ఈ టీమిండియా, ఐపిఎల్ మాజీ ప్లేయర్ కూడా బాగానే ఆస్తులు సంపాదించాడు.  రైనా ఆస్తుల విలువ రూ.207 కోట్లు. అతడు ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు. 
 

Gambhir

గౌతమ్ గంభీర్ : 

మాజీ భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ టీంకు మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. అతడి ఆస్తుల విలువ రూ.207 కోట్లకు పైగా వుంటుంది. 
 

Virendra Sehwag

వీరేంద్ర సెహ్వాగ్ : 

టీమిండియా ఓపెనర్ అనగానే ముందుగా గుర్తకువవచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ పేరు. వస్తూవస్తూనే బౌలర్లపై విరుచుకుపడుతూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే సెహ్వాగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇలా క్రికెటర్  గా మంచి పేరు సంపాదించుకున్న సెహ్వాగ్ ఆస్తులను కూడా సంపాదించుకున్నారు.  అతడి ఆస్తుల విలువ రూ.2023 కోట్లు. 

Rahul Dravid

రాహుల్ ద్రావిడ్ : 

టీమిండియా మాజీ కెప్టెన్ గానే కాదు కోచ్ గా కూడా రాహుల్ ద్రావిడ్ క్రికెట్ ప్రియులకు సుపరిచితం. కర్ణాటకకు చెందిన ఈ సీనియర్ ప్లేయర్ ఆస్తులు రూ.199 కోట్లు. 

Latest Videos

click me!