శరీరంలో ఇవి లోపిస్తే బట్టతల వచ్చేస్తుందా! అవి ఏంటో మీకు తెలుసా!

First Published Dec 4, 2021, 4:19 PM IST

బట్టతల సమస్యలు (Baldness problems) ఆడవారి కంటే మగవారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్టతలకి కారణం శరీరంలో కొన్ని పోషకాల లోపమే ముఖ్య కారణమని వైద్యులు తెలుపుతున్నారు. అధిక పని ఒత్తిడి కారణంగా శరీరం ఒత్తిడికి లోనైనప్పుడు జుట్టుకు తగిన పోషకాలు అందక జుట్టు రాలే సమస్యలు అధికం అవుతాయి. ఇది రాను రాను బట్టతలకు కారణమవుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా శరీరంలో ఏవి లోపిస్తే బట్టతల వస్తుందో వాటి గురించి తెలుసుకుందాం..
 

మనం తీసుకునే ఆహారంలో (Food) జుట్టు పోషణకు సహాయపడే పోషకాలు లేకుంటే జుట్టు పెరుగుదల దెబ్బతిని బట్టతలకు ఏర్పడడానికి దారితీస్తుంది. బట్టతల సమస్యలు ముసలి వారినే కాకుండా యుక్తవయసు యువకులలో కూడా ఇబ్బందికి గురిచేస్తుంది. బట్టతల ఉన్నవారు నలుగురిలో తిరగడానికి ఇబ్బందిగా (Embarrassing) భావిస్తారు.
 

బట్టతల కారణంగా వారి వయసు ఎక్కువగా కనిపిస్తుంది. బట్టతల రావడానికి వంశపారంపర్య కారణాలు (Hereditary causes) కొంతవరకు కారణమైతే కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి వర్తిస్తుంది. అయితే ఇప్పుడు శరీరంలో ఏ పోషకాలు లోపిస్తే బట్టతల (Baldness) వస్తుందో తెలుసుకుందాం. 
 

పొటాషియం: పొటాషియం (Potassium) జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో పొటాషియం శాతం లోపించినప్పుడు హెయిర్ డ్యామేజ్ (Hair Damage) అవుతుంది. దీంతో జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. జుట్టు బలహీనపడి ఎక్కువ మొత్తంలో ఊడిపోయే అవకాశం ఉంటుంది.
 

కొల్లాజెన్: జుట్టు మూలాలను బలపరిచే (Strengthening) ప్రధాన మూలకం కొల్లాజెన్ (Collagen). ఇది జుట్టు ఒత్తుగా మందంగా పెరిగేలా చేస్తుంది. ఈ మూలకం లోపం ఏర్పడినప్పుడు జుట్టు బాగా ఉపయోగపడుతుంది. జుట్టు నిర్జీవంగా మారి అధిక మొత్తంలో రాలిపోతుంది. దీని కారణంగా బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 

విటమిన్ సి: విటమిన్ సి (Vitamin C) కేశాలను దృఢంగా పెరిగేలా పోషకాలను (Nutrients) అందించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం ఉన్నట్టయితే జుట్టు బలహీనపడి  నిర్జీవంగా మారడంతో బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 

ఐరన్: ఐరన్ (Iron) రక్తంలోని ఆక్సిజన్ (Oxygen) శాతాన్ని పెంచి కేశాలకు తగినంత రక్తప్రసరణ జరిగేందుకు కావలసిన హెయిర్ పాలీసెట్ కు కావలసిన న్యూట్రీషియన్స్ ను అందించి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడినప్పుడు  అది బట్టతలకు దారితీస్తుంది.
 

జింక్: జింక్ లోపం (Zinc deficiency) కారణంగా శరీరానికి కావలసిన పోషకాలు అందక చర్మ వ్యాధులకు దారితీస్తుంది. అయితే ఈ జింకు ప్రభావం మొదట జుట్టు సమస్యలకు (Hair problems) దారి తీస్తుంది. దీంతో జుట్టు అధిక మొత్తంలో రాలడం మొదలవుతుంది. శరీరం జింక్ లోపానికి గురయితే జింక్ మాత్రలు తీసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది.
 

బయోటిన్: బయోటిన్ (Biotin) జుట్టు సంరక్షణకు (Hair care) సహాయపడే మూలకం. శరీరం బయోటిన్ లోపానికి గురి అయినప్పుడు జుట్టు, గోర్లు బలహీనపడతాయి. బయోటిన్ లోపం కారణంగా జుట్టు రాలే సమస్య అధికమవుతాయి. ఈ బయోటిన్ గోళ్ల పెరుగుదలను కూడా అడ్డుకుంటుంది.

click me!