ఈ మూఢనమ్మకాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంత దారుణమో!

First Published Oct 27, 2021, 2:21 PM IST

భారతదేశంలోని (India) అనేక ప్రాంతాలలోని ప్రజలు మూఢనమ్మకాలను (Superstitions), దురాచారాలను (Vices) ఎక్కువగా  నమ్ముతారు. కాలంలో మార్పులు వచ్చినప్పటికీ కూడా  వీటిని నమ్ముతూనే ఉన్నారు. మూఢ నమ్మకం అంటే తమను తాము వంచించుకోవడం. ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ ప్రాంతాల ప్రజలు ఆచరిస్తున్నటువంటి  మూఢనమ్మకాలు, దురాచారాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడం.
 

విజ్ఞానపరంగా, శాస్త్రీయపరంగా (Scientifically) భారతదేశం (India) ఎంత ముందు ఉన్నప్పటికీ కొన్ని మూఢనమ్మకాలను, దురాచారాల విషయంలో కూడా అంతే ముందున్నారు. వీటిని పాటించకపోతే అరిష్టం కలుగుతుందని, వెళ్లే పని పూర్తి కాదని భావించి మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. కొన్ని మూఢనమ్మకాలు దురాచారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

పూర్వకాలంలో బాలికలు యుక్తవయసుకు (Young age) రాకముందే పెళ్లి చేయాలనే నియమం ఉండేది. వివాహం తర్వాత భర్త మరణిస్తే (Death)భర్త శవంతో పాటు భార్యను కూడా సజీవదహనం చేసేవారు.
 

పిల్లలు పుట్టని స్త్రీలను గొడ్రాలని సూటిపోటి మాటలతో దూషించేవారు (Blasphemers). గొడ్రాలు, విధవరాలు ఎదురు కావడం అశుభమని (Ominous) భావిస్తారు. ఇంటి గుమ్మం పైన, రోలు మీద కూర్చోరాదు. తుమ్మ రాదు.
 

ఏదైనా శుభకార్యామును ప్రారంభించేముందు ముగ్గురితో ప్రారంభించరాదు. నల్ల పిల్లి (Black cat) ఎదురు కాకూడదని లేదంటే అరిష్టం కలుగుతుంది. తల్లి దండ్రులు (Parents) చనిపోయిన సంవత్సరంలోపే యుక్తవయసు పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి లేదా మూడేళ్ళు ఆగాలి.
 

పని మీద బయటకు వెళుతున్న వ్యక్తులను ఎక్కడికి వెళుతున్నావు అని అడగరాదు, తుమ్మరాదు. కాకి (Crow), గబ్బిలాలు (Owl) ఇంట్లోకి ప్రవేశించరాదు. ఇంటి లోపలి ప్రాంగణంలో గోర్లు కత్తిరించరాదు. శుక్రవారం, మంగళవారం రోజున జుట్టును (Hair), గోర్లను (Nails) కత్తిరించరాదు.
 

పగిలిన అద్దం ఇంటి లోపల ఉండరాదు. గుడి గోపురం నీడ ఇళ్ళమీద పడకూడదు. గ్రహణం రోజు గర్భిణీలు (Pregnant Womens) బయటకు రాకూడదు. మాంసం (Non veg) తీసుకువెళ్ళేటప్పుడు బొగ్గు (coal) తీసుకువెళ్ళమని చెబుతారు. భర్త ఉద్యోగానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే ఇంటిని తుడవడం, ఊడవడం చేయరాదు. కొంత సమయం తర్వాత శుభ్రపరచాలి.

click me!