నడుం నొప్పిని ఎలా తగ్గించుకోవాలి?

First Published May 1, 2024, 1:24 PM IST

నడుం నొప్పికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కూర్చోవడానికి, నడవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే మందులు వాడకుండా దీనిని సహజంగా తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు గనుక వాటిని ఫాలో అయితే చాలా తొందరగా నడుం నొప్పి నుంచి బయటపడొచ్చు. 
 

మన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయి. వీటి ప్రభావం మన ఆరోగ్యంపై బాగా కనిపిస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం, అనారోగ్యకరమైన ఆహారం వంటి ఎన్నో కారణాల వల్ల నేడు ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి. వెన్నునొప్పి సమస్య ఇప్పుడు వృద్ధులకే కాకుండా యువతకు కూడా వస్తోంది. మనకున్న కొన్ని అలవాట్లు కూడా వెన్ను నొప్పికి కారణమవుతాయి. తప్పుడు భంగిమలో కూర్చోవడం, తప్పుడు వ్యాయామం, గాయాలు లేదా కండరాల ఒత్తిడి వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. మీరు కూడా వెన్ను నొప్పితో బాధపడుతుంటే దానిని సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

back pain

వెన్నునొప్పికి కారణాలు 

వెన్నునొప్పి రావడానికి ప్రధాన కారణం.. తప్పుడు భంగిమలో కూర్చోవడం లేదా నిద్రపోవడం. సరైన పొజీషన్ లో కూర్చోకపోవడం వల్ల చాలా మందికి చాలా తొందరగా నడుం నొప్పి వస్తుంది. అలాగే బెణుకు, హెవీ లిఫ్టింగ్, ఒత్తిడి లేదా హెర్నియేటెడ్ డిస్క్ వంటి గాయాల వల్ల కూడా నడుం నొప్పి వస్తుంది. అంతేకాదు  కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వెన్ను నొప్పికి దారితీస్తాయి. ఇన్ఫెక్షన్, మూత్రపిండాల్లో రాళ్లు, సయాటికా, ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి వంటివి కూడా కొన్ని సందర్భాల్లో కూడా వెన్నునొప్పిని కలిగిస్తాయి. ముఖ్యంగా దిగువ వీపులో. అందుకే చాలా కాలంగా మీకు వెన్ను నొప్పి ఉంటే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడం ఎలా?

వ్యాయామం 

వ్యాయామం చేయడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాయామం వల్ల  మీ ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. అందుకే రెగ్యులర్ గా కనీసం 30 నిమిషాల పాటైనా మితమైన వ్యాయామం చేయండి. దీనివల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. వ్యాయామం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇందుకోసం వాకింగ్, యోగా, స్ట్రెచింగ్ బాగా ఉపయోగపడతాయి. అయితే మీకు వెన్నునొప్పి ఉంటే మీ ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో వ్యాయామం చేయండి.
 

శరీర భంగిమ

పేలవమైన భంగిమ కూడా వెన్నునొప్పికి కారణమవుతుంది. అందుకే కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నిలబడేటప్పుడు సరైన భంగిమలో ఉండండి. ఇది వెన్నునొప్పి వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం నిటారుగా కూర్చోవడం, భుజాలను నిటారుగా ఉంచడం, సరైన, సౌకర్యవంతమైన కుర్చీని ఉపయోగించడం చేయండి. అలాగే భారీ వస్తువులను ఎత్తేటప్పుడు సరైన టెక్నిక్ ఉపయోగించండి. అవసరమైతే ఒకరి సహాయం తీసుకోండి. ఇది మీ వీపుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే నొప్పిని కలిగించదు. మీకు వెన్ను నొప్పి ఉంటే దీనివల్ల అది పెరగదు. 

హాట్-కోల్డ్ థెరపీ

వెన్ను వాపును తగ్గించడానికి మీరు ఐస్ ను ఉపయోగించొచ్చు. అలాగే కండరాల నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని నీటితో కంప్రెస్ చేయొచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.
 

back pain

డాక్టర్ సహాయం 

మీకు వెన్ను నొప్పి చాలా కాలంగా ఉండి వ్యాయామం మొదలైన వాటితో కూడా తగ్గకపోతే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి. వెన్ను నొప్పికి గల కారణాలేంటో తెలుసుకుని చికిత్స తీసుకుంటే వెన్ను నొప్పి తగ్గిపోతుంది. 

click me!