వస్తు సేవల పన్ను (GST) వసూళ్లలో భారతదేశం ఆల్ టైమ్ రికార్డు నమోదుచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అత్యధికంగా జిఎస్టి వసూలయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
న్యూడిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే రికార్డు స్థాయిలో గూడ్స్ ఆండ్ సర్వీసెస్ టాక్స్ (GST) వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే జీఎస్టి వసూళ్ళు రెండు లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటినెల ఏప్రిల్ లో ఏకంగా రూ.2.10 లక్షల కోట్లు జీఎస్టి రెవెన్యూ నమోదయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
గత ఆర్థిక సంవత్సరం 2023-24లో సరిగ్గా ఇదే ఏప్రిల్ లో రూ.1,87,035 కోట్ల జిఎస్టి వసూలయ్యింది. ఈసారి ఇది 12.4 శాతం పెరిగి 2 లక్షల కోట్లను దాటిపోయాయి. జిఎస్టి రిఫండ్ తర్వాత నెట్ రెవెన్యూ రూ.1.92 లక్షల కోట్లుగా వుంది... గతంతో పోలిస్తే ఇది 17 శాతం పెరుగుదల.
సెంట్రల్ గూడ్స్ ఆండ్ సర్వీసెస్ ట్యాక్ (CGST) - రూ.43,846 కోట్లు
రాష్ట్రాల గూడ్స్ ఆండ్ సర్వీసెస్ టాక్స్ (SGST) - రూ.53,538 కోట్లు
ఇంటిగ్రేటెడ్ గూడ్స్ ఆండ్ సర్వీసెస్ టాక్స్ (IGST) - రూ.99,623 కోట్లు
సెస్ - 13,260 కోట్లు
రాష్ట్రాల వారిగా జిఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే మహారాష్ట్రలో అత్యధికంగా రూ.37,671 కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఇదే సమయంలో రూ.33,196 కోట్లు వసూలయ్యాయి. అంటే 13 శాతం పెరుగుదల వుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో రూ.6,236 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో రూ.4,850 కోట్లుగా జిఎస్టి వసూళ్లు వున్నాయి.
👉 revenue collection for April 2024 highest ever at Rs 2.10 lakh crore
👉 collections breach landmark milestone of ₹2 lakh crore
👉 Gross Revenue Records 12.4% y-o-y growth
👉 Net Revenue (after refunds) stood at ₹1.92 lakh crore; 17.1% y-o-y growth https://t.co/aSUkhMyMLr