క్యాన్సర్ పేషెంట్లకు పెట్టాల్సిన ఆహారాలు ఇవే..!

First Published Aug 7, 2022, 10:27 AM IST

క్యాన్సర్ చికిత్స తీసుకునే వారు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఇవి  వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు.. చనిపోయిన కణాలను పునరుద్దరించడానికి సహాయపడతాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంతేకాదు దీని నుంచి కోలుకుని బయటపడ్డ వారు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఎంతో మంది సెలబ్రిటీలు సైతం దీనిబారిన పడి ప్రాణాలు కోల్పోయారు.  ఎందుకంటే క్యాన్సర్ నుంచి కోలుకోవడం అంత సులువు కాదు. దీన్ని ముందస్తుగా గుర్తిస్తే.. కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే క్యాన్సర్ కు చికిత్స తీసుకునే వారు కూడా డాక్టర్ సలహాలను ఖచ్చితంగా ఫాలో అయితేనే తొందరగా కోలుకుంటారు. 

cancer

అయితే క్యాన్సర్ కు చికిత్స తీసుకునే వాళ్లు మందులను, చికిత్సా విధానాలను తూ. చా తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా వీరు పోషకాలు తక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. ఎందుకంటే చనిపోయిన కణాలను పునరుద్దరించడానికి, తగ్గిన రోగ నిరోధక శక్తిని పొందడానికి పోషకాహారం ఎంతో అవసరం.

cancer

క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడం, మందుల వాడకం వల్ల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా ఆకలి అలసే ఉండదు. ముఖ్యంగా శరీరానికి శక్తి ఉండదు. రోగ నిరోధక వ్యవస్థ కూడా బలహీనంగా మారుతుంది. దీంతో శరీరం సంక్రామ్యతకు గురువుతుంది. అందుకే ఆకలిగా లేకపోయినా.. పోషకాహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. రంగురంగుల్లో ఉండే కూరగాయలను, పండ్లను, మొక్కల ఆధారిత ఆహారాలను తినడం మంచిది. వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే  ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 

తినాల్సిన ఆహారాలు..

1. సీజనల్ పండ్లు, కూరగాయలు

2. గింజలు

3. బీట్ రూట్, బచ్చలి కూర రసం- ఇవి రక్త కణాలను పెంచుతాయి.

4. సలాడ్లు, గుడ్లు, చికెన్

5. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు-చేపలను తినాలి

6. నట్స్, అవొకాడో వంటి పోషకాహారాలను రోజుకు మూడు పూటలా తినాలి

క్యాన్సర్ పేషెంట్లకు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ ను అసలే తినకూడదు. కేవలం పోషకాహారం మాత్రమే పెట్టాలి.
 

click me!