ఆడవాళ్లు భావప్రాప్తిని ఏయే మార్గాల ద్వారా పొందుతారో తెలుసా?

First Published | Jun 4, 2023, 9:40 AM IST

ఆడవారి భావప్రాప్తి విషయానికొస్తే.. వీళ్లు సంభోగం ద్వారా మాత్రమే భావప్రాప్తిని పొందుతారని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది తప్పు. ఎందుకంటే ఆడవాళ్లు ఎన్నో విధాలుగా భావప్రాప్తిని పొందుతారు. 
 

స్త్రీ ఉద్వేగం అనేది లైంగిక స్థితి. దీనిలో ఆడవాళ్లు లైంగిక ఉద్దీపన సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన, ఆనందకరమైన అనుభూతిని పొందుతారు. ఇది సాధారణంగా మెదడు, శరీరం, భావోద్వేగ స్థాయిలో మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మగవారు రతిక్రీడలో చాలా తొందరగా భావప్రాప్తిని పొందుతారు. స్త్రీలు అలా కాదు. వీళ్లు భావప్రాప్తి పొందేందుకు చాలా టైం పడుతుంది. చాలాసార్లు మహిళలు భావప్రాప్తి కోసం కష్టపడాల్సి ఉంటుంది. అలాగే దీనికి చాలా సమయం పడుతుంది. ప్రతి మహిళకు యోని నుంచి ఉద్వేగం ఉండదు. కాబట్టి దీని కోసం పురుషుల కంటే మహిళలు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.

స్త్రీల భావప్రాప్తి అనుభవం, విధానం స్త్రీ నుంచి స్త్రీకి మారోచ్చు. ఇది భావోద్వేగ, శారీరక, సామాజిక కారకాల వల్ల ప్రభావితమవుతుంది. కొంతమంది మహిళలు క్లైటోరల్ ఉద్దీపన ద్వారా మాత్రమే భావప్రాప్తిని పొందుతారు. మరికొందరు యోని ఉద్దీపన నుచి ఉద్వేగం పొందుతారు. స్త్రీలు ఏయే మార్గాల ద్వారా భావప్రాప్తిని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


 క్లిటోరల్ భావప్రాప్తి

స్త్రీ ఉద్వేగంలో అత్యంత సాధారణ రకం ఇది. క్లిటోరస్ ఉద్దీపన వల్ల ఆడవాళ్లు మంచి అనుభూతిని చెందుతారు. ఇది మంచిి భావప్రాప్తిని కలిగిస్తుంది. క్లిటోరల్ దగ్గర ఎన్నో నరాల చివరలు కలిసి ఉంటాయి. ఇది ఆడవారికి మంచి భావప్రాప్తిని కలిగిస్తుంది. 

యోని భావప్రాప్తి

కొంతమంది మహిళలు యోని గోడల ఉద్దీపన ద్వారా ఉద్వేగాన్ని పొందుతారు. దీన్నే జి-స్పాట్ అని కూడా అంటారు. జి-స్పాట్ అనేది యోని లోపల ఉన్న ఎరోజెనస్ జోన్.  ఇది కూడా ఆడవారికి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

మిశ్రమ భావప్రాప్తి

ఈ రకమైన ఉద్వేగం క్లిటోరస్, యోని ఉద్వేగాల కలయికను కలిగి ఉంటుంది. క్లిటోరస్, జి-స్పాట్ రెండూ ఒకేసారి ప్రేరేపించబడినప్పుడు మిశ్రమ భావప్రాప్తిని పొందుతారు. ఇది ఆడవాళ్లకు ఆనందకరమైన అనుభూతిని కలిగిస్తుంది. 
 

Image: Getty Images

గర్భాశయ భావప్రాప్తి

ఈ రకమైన ఉద్వేగం గర్భాశయం ద్వారా ప్రేరేపించబడుతుంది. ఈ రకమైన భావప్రాప్తి గర్భాశయం దిగువ భాగంలో పుడుతుంది. ఇది యోని వరకు విస్తరించి ఉంటుంది. గర్భాశయ ఉద్వేగాలు మీ మొత్తం శరీరానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది.  
 

Image: Getty Images

రొమ్ము భావప్రాప్తి

కొంతమంది మహిళలు చనుమొనలు, రొమ్ము ఉద్దీపన ద్వారా భావప్రాప్తిని పొందుతారు. చనుమొనలు, జననేంద్రియ ప్రాంతం మధ్య సంబంధం వల్ల ఈ రకమైన ఉద్వేగం సంభవిస్తుందని నమ్ముతారు. 

click me!