సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికీ జుట్టంటే చాలా ఇష్టం. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు, షైనీగా కనిపించేందుకు రకరకాల షాంపూలు, నూనెలను ట్రై చేస్తుంటాం. ఒక్క ఆడవాళ్లే కాదు మగవారు కూడా జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పురుషులు ఎట్టిపరిస్థితిలో బట్టతల రావొద్దని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసు వారు కూడా బట్టతల బారిన పడుతున్నారు. హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం వల్ల పురుషులకు బట్టతల వస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత లేదా మాదకద్రవ్యాల వాడకం వల్ల బట్టతల వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతిరోజూ ఒక డ్రింక్ ను తాగడం వల్ల కూడా బట్టతల వస్తుందని తెలిస్తే షాక్ అవుతారు.
బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. కొన్ని రకాల పానీయాలు తాగే అలవాటు ఉన్న పురుషుల జుట్టు రాలడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాదు వీరి జుట్టు చాలా ఫాస్ట్ గా ఊడిపోతుందని వెల్లడైంది.
baldness men
ఎనర్జీ డ్రింక్స్
ఎనర్జీ డ్రింక్స్ లేదా షుగర్ డ్రింక్స్, సోడా తాగేవారికి జుట్టు రాలడం, బట్టతల వచ్చే అవకాశం ఉందని చైనా పరిశోధకులు ఒక అధ్యయనంలో కనుగొన్నారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ ప్రభావం పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుందట. ముఖ్యంగా 13 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులే ఈ వ్యాధి బారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది.
అధ్యయనం ఎలా జరిగింది?
1000 మంది పురుషులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ముందుగా వారానికి 3 లీటర్ల ఎనర్జీ డ్రింక్స్ ను తాగాలని సూచిస్తున్నారు. రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి జుట్టు రాలిపోయే ప్రమాదం 42 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్స్ తినే వారు లేదా తక్కువ కూరగాయలు తినే వారికి జుట్టు రాలడమే కాదు వీళ్లు తరచుగా ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా ఉందని అధ్యయనం కనుగొంది. ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్స్ ఊబకాయానికి దారితీస్తాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. \\
జుట్టు స్ట్రాంగ్ గా ఉండాలంటే ?
జుట్టు బలహీనంగా ఉంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. నిపుణుల సలహాతో పాటుగా ఇంటి చిట్కాలను కూడా ప్రయత్నించాలి. జుట్టు రాలడం లేదా బలహీనమైన జుట్టును బలోపేతం చేయడానికి కలబంద జెల్ ను ఉపయోగించండి. జుట్టు రాలడానికి చుండ్రే ప్రధాన కారణం. అందుకే నిమ్మరసం, పెరుగు ఉపయోగించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సీజన్ తో సంబంధం లేకుండా స్నానం చేసే ముందు నిమ్మ-పెరుగు పేస్ట్ ను తలకు అప్లై చేయండి. జుట్టు ఒత్తుగా ఉంటే.. మెరిసే, జుట్టు పెరగడానికి గుడ్డు హెయిర్ మాస్క్ ను అప్లై చేయండి. ఏదేమైనా వీటిని పాటించే ముందు డాక్టర్లను సంప్రదించడం మర్చిపోకండి.