దేవర, RRR,సలార్, కేజీఎఫ్.. సీక్వెల్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

First Published | Nov 28, 2024, 8:59 PM IST

రిలీజ్ కు ముందే రికార్డ్ లు బ్రేక్ చేస్తోంది సీక్వెల్ మూవీ పుష్ప. పుష్ప టైప్ లోనే ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు ఏవైనా.. సీక్వెల్స్ కోసం ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ ను అసంపూర్తిగా వదిలేస్తున్నారు. మరి పుష్పతో పాటు సీక్వెల్స్ కు రెడీగా ఉన్న సినిమాలు ఏంటో తెలుసా..?

Pushpa 2

పుష్ప2 వస్తోంది.. డిసెంబర్ 5న రిలీజ్ కు ముస్తాబయ్యింది సీక్వెల్ మూవీ. పుష్పనే బ్లాక్ బస్టర్ అంటే.. అంతకు మించి చూపిస్తామంటున్నారు టీమ్. భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబతోంది సీక్వెల్ మూవీ. అల్లు అర్జున్, రష్మిక జంటగా.. సుకుమార్ క్రియేట్ చేసిన ఈ అద్భుత కళాకండం.. ఇతర సీక్వెల్ మూవీస్ కు కూడా ధైర్యంగా మారే అవకావం ఉంది. ఇంతకీ నెట్స్ రెడీ అవుతున్న సీక్వెల్స్ ఏంటో తెలుసా..? 

Also Read: చిరంజీవి చాలా ఇష్టంగా తినే కూర ఏంటో తెలుసా..? మెగాస్టార్ భోజనం ప్లేట్ లో ఆ ఐటం పక్కాగా ఉండాల్సిందే

Devara

కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా తెలియదు వాటికి సీక్వెల్స్ ఉంటాయని. కథ కాస్త పెద్దది అవ్వడంతో.. ట్రెండ్ నడుస్తంది కాబట్టి రెండుగా తీద్దాం.. వర్కౌట్ అవుతుంది అని అప్పుడు అనుకుని సెట్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో దేవర కూడా ఒకటి.

ఎన్టీఆర్, కొరటాల బ్లాక్ బస్టర్ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఊచకోతకు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఓ పద్ద ట్విస్ట్ పెట్టి.. క్లైమాక్స్ ను అన్ కంప్లీట్ చేశారు టీమ్. ఇక దేవర 2 కోసం ఈగర్ గా వెయిట్ చేసేవిధంగా ప్లాన్ చేశారు. మరి దేవర 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. 

Also Read: రజినీకాంత్ తల్లిగా ఆరాధించే ఈ చిన్నారి ఎవరో తెలుసా ?


ప్రభాస్ కెరీర్ లో వరుస ఫెయిల్యూర్స్ తరువాత ఓమోస్తరు హిట్ అందించింది సలార్. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు. అంతే కాదు వారియర్ గాప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ మరిసిపోయారు. ఇక ఈసినిమాకు సెకండ్ పార్ట్ ఉందని ముందుగానే చెప్పారు టీమ్. అసలు సలార్ కూడా సెకండ్ పార్ట్ లోనే కనిపించబోతున్నాడు. మరి ఈమూవీ ష‌ూటింగ్ ఎప్పుడు.. రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ రావల్సి ఉంది. 

సీక్వెల్ సీజన్ ని స్పీడప్ చేసింది కెజిఎఫ్. కెజిఎఫ్ .. సౌత్ సినిమా రికార్డులు చెరిపేసి రికార్డ్ కలెక్షన్లతో కన్నడ సినిమా స్టామినా ని ప్రూవ్ చేసిన సినిమా. కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కి సర్ ప్రైజ్ అయిన ఆడియన్స్ .. కెజిఎఫ్ 2సూపర్ సక్సెస్ ని చూసి అంతా  షాక్ అయ్యారు. ఫస్ట్ పార్ట్ ని మించిన గ్రాండియర్ , స్టార్ కాస్ట్ , బడ్జెట్ తో తెరకెక్కిన కెజిఎఫ్ 2 సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

అయితే  ఈ రికార్డుల్ని కంటిన్యూ చెయ్యబోతోంది కెజిఎఫ్ 3.కెజిఎఫ్ 2 మేకింగ్ తోనే ఆశ్చర్యపోయిన ఆడియన్స్ కి ..లాస్ట్ లో కెజిఎఫ్ 3 అంటూ సర్ ప్రైజింగ్ సీక్వెల్ అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్ సలార్2, ఎన్టీఆర్ సినిమాతో.. యష్.. టాక్సిక్ తో బిజీగా ఉన్నారు. 
Also Read: ట్విట్టర్ వాడకండి.. ఎలన్ మస్క్ కు హీరో శివకార్తికేయన్ ఛాలెంజ్..

ఇక ప్రస్తుతం  అందరు సీక్వెల్స్ అంటుంటే.. కాంతార టీమ్ మాత్రం ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం జోరుగా జరుగుతుంది షూటింగ్. కాంతార కన్నడ నాట మాత్రమే కాకుండా పాన్ ఇండియాను ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో రుషబ్ శెట్టి టాలెంట్ అందరికి అర్ధం అయ్యింది. ఇక కాంతారా అసలు చరిత్రను ప్రీక్వెల్ సినిమాతో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రిషబ్. మరి ఈసినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కాని.. కాంతార ప్రీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

Actor Satyadev about Rajamuli film RRR

సీక్వెల్ ప్లాన్ లో ఉంది బ్లాక్ బస్టర్ మూవీ ట్రిపుల్ఆర్ .  రాజమౌళి  డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ డైరెక్షన్లో  గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమా  అంత కంటే గ్రాండ్ గా రిలీజ్ అయింది. అనుకున్నట్టుగానే ట్రిపుల్ఆర్ వెయ్యి కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయింది. అంతే కాదు ఆస్కార్ కూడా సాధించింది.  ట్రిపుల్ఆర్ సీక్వెల్ కి ఛాన్సుందని.. ఆ యాంగిల్ లో స్టోరీ రెడీ చేస్తున్నాం అంటూ గతంలో స్టేట్ మెంట్ ఇచ్చారు  రైటర్ విజయేంద్రప్రసాద్. అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా  సీక్వెల్ ఉంటే సై అంటున్నారు. మరి ఇంది ఎంత వరకు నిజమో చూడాలి. 
 

Bahubali Rajamouli

తెలుగు సినిమా చరిత్రను మార్చిన బాహుబలి , ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన బాహుబలి .. వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 2 వేల కలెక్షన్లకు పైగా సాధించింది. బాహుబలి రెండు పార్టులుగా వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది. 5 ఏళ్లుగా ఈ సినిమా సీక్వెల్ మీద లేని చర్చ..లేటెస్ట్ గా తెరమీదకి వచ్చింది. రాజమౌళి బాహుబలి పార్ట్ 3 ప్లాన్ చేస్తే ..చెయ్యడానికి రెడీ ప్రభాస్ . సో.. బాహుబలి 3 కూడా సెట్స్ మీదకొచ్చే అవకాశం ఇప్పట్లో లేదు అనిమాత్రం చెప్పచ్చు.

Latest Videos

click me!