గేమ్ ఛేంజర్ 'నానా హైరానా' సాంగ్ రివ్యూ: థమన్ అద్భుతం చేశాడు, మనసులు దోచేస్తున్న మెలోడీ!

First Published | Nov 28, 2024, 8:18 PM IST

గేమ్ ఛేంజర్ మూవీ నుండి థర్డ్ సాంగ్ విడుదల చేశారు. నానా హైరానా పేరుతో విడుదలైన ఈ మెలోడీ అద్భుతంగా ఉంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.. 
 

Game Changer

దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. గేమ్ ఛేంజర్ మూవీలోని మూడవ పాట విడుదలైంది. ఈ బ్యూటిఫుల్ మెలోడి మనసులు దోచేసింది. 

Game Changer

హై బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ శంకర్. ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం ఒక డైమండ్. ఈ మధ్య ఆయన కొంచెం తడబడుతున్నారు. భారతీయుడు 2 డిజాస్టర్ అయ్యింది. ఇక సాంగ్స్ తెరకెక్కించడంలో శంకర్ దిట్ట. శంకర్ తీసినంత గ్రాండ్ గా, విజువల్ వండర్ గా మరొక దర్శకుడు పాటను చిత్రీకరించలేడు అంటే అతిశయోక్తి కాదు. 

Latest Videos


రెండు దశాబ్దాల క్రితమే ఆయన అద్భుతాలు చేశాడు. భారతీయుడు, ఒకే ఒక్కడు, జీన్స్, రోబో చిత్రాల్లో సాంగ్స్ నభూతో నభవిష్యతి. శంకర్ మొదటిసారి ఓ టాలీవుడ్ హీరోతో మూవీ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న విడుదల కానుంది. సమయం దగ్గర పడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. 

ఇప్పటికి గేమ్ ఛేంజర్ నుండి రెండు పాటలు విడుదల చేశారు. సెప్టెంబర్ 28న థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'నానా హైరానా' అనే ఈ మెలోడీ సాంగ్ మనసులు దోచేసింది. ఒక్కసారి వినగానే నచ్చే సాంగ్స్ అరుదుగా ఉంటాయి. నానా హైరానా.. అలానే ఉంది. థమన్ స్వరపరిచిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడారు. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

పాట ఎంత అద్భుతంగా ఉందో పిక్చరైజేషన్, లొకేషన్స్ అంతే అద్భుతంగా ఉన్నాయి. ఒకప్పటి శంకర్ సినిమాల్లో కనిపించిన గ్రాండ్ నెస్ ఈ సాంగ్ లో కనిపించింది.  కియారా అద్వానీ గ్లామర్ మెస్మరైజ్ చేసేలా ఉంది.మొత్తంగా థర్డ్ సాంగ్ మెప్పించింది. సినిమాపై పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసింది. 

ఇక గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పీరియాడిక్ రోల్ లో ఆయన పొలిటీషియన్ గా కనిపిస్తాడు. మరో పాత్రలో ఐఏఎస్ అధికారి అని సమాచారం. శ్రీకాంత్, సునీల్, ఎస్ జే సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. ఇటీవల గేమ్ ఛేంజర్ మూవీకి డబ్బింగ్ చెప్పిన ఎస్ జే సూర్య మూవీగా గొప్పగా ఉంటుంది. థియేటర్స్ దద్దరిల్లుతాయి అన్నారు. ఆయన షార్ట్ రివ్యూ వైరల్ అయ్యింది. గేమ్ ఛేంజర్ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. 

click me!