కడలూరు
ఈ సంవత్సరం అనుకున్నదానికంటే ముందుగానే ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడులో ప్రారంభమయ్యాయి. గత అక్టోబర్ లోనే తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినప్పటికీ పెద్దగా వర్షాలు కురవలేదు. అయితే ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి.
తమిళనాడు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడంతో డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరి, కారైక్కాల్‌తో సహా పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసారు. ఇక రానున్న 24 గంటల్లో తమిళనాడులోని పుదుక్కోటై, తంజావూర్, అరియలూర్, చెంగల్పట్టు జిల్లాల్లో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
భారీ వర్షం
ఈ వర్షాల నేపథ్యంలో రేపు అంటే నవంబర్ 29న చెంగల్పట్టు, విజపురం, కడలూర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తిరుచ్చిరాపల్లి, పెరంబలూర్, కళ్లకురిచ్చి జిల్లాల్లో చిరుజల్లుకు కురిసాయి.
తమిళనాడులో భారీ వర్షం
రేపు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కడలూరులో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 1 వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం సూచిస్తోంది.