బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయాలు, దేవతలను అపవిత్రం చేయడం, పాడు చేయడం వంటి అనేక సంఘటనలు గత కొన్ని నెలలుగా నివేదించబడ్డాయి. ఢాకాలోని తాంతిబజార్‌లోని పూజా మండపంపై దాడి, దొంగతనం సహా అటువంటి సంఘటనల గురించి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2024 దుర్గాపూజ సందర్భంగా సత్ఖిరాలోని జెషోరేశ్వరి కాళీ దేవాలయంలో దాడిని కూడా ప్రస్తావించింది.
మైనారిటీ సమూహాలతో సహా జీవనం, స్వేచ్ఛ రక్షణ ప్రాథమికంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా బంగ్లాదేశ్ మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలనీ, దాని పౌరులందరూ శాంతియుత సహజీవనం కొనసాగించేలా చూడాలని కోరింది.