చలికాలంలో చర్మం పొడిబారుతోందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

First Published Dec 24, 2022, 4:21 PM IST

శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచితే.. చర్మం పొడిబారే అవకాశం ఉంది. ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటే చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. 
 

skin care

చల్లని గాలులు మన ఆరోగ్యాన్నే కాదు మన చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ చల్లని గాలులను తట్టుకోవడానికి చాలా మంది వేడినీటితో స్నానం చేస్తారు. వేడి మంటల మందు కూర్చుంటారు. కానీ ఈ అలవాట్లు అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటివల్ల చర్మం పొడిబారుతుంది. చర్మంలోని తేమనంతా ఇవి తగ్గిస్తాయి. నిజానికి మంచి మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం వల్ల స్కిన్ డ్రైనెస్ పోతుంది. అయితే చర్మాన్ని లోపలి నుంచి తేమగా మార్చితే చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం కొన్ని రకాల ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..

skin care

అరటిపండు తినండి

చర్మ సంరక్షణ కోసం, జుట్టు సంరక్షణ కోసం అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. అరటిపండులో విటమిన్ ఎ, విటమిన్ బి,విటమిన్ సి, విటమిన్ డి, రాగి, జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, భాస్వరం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అరటిలో యాంటీ ఏంజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. ఫైబర్ శరీరంలోని విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.  దీని వల్ల చర్మ కణాలు మళ్లీ యవ్వనంగా కనిపిస్తాయి. రోజూ ఒక అరటిపండును తింటే  చర్మం మెరుస్తూ, మృదువుగా ఉంటుంది.
 

skin care

కొబ్బరి నూనెను మీ ఆహారంలో ఉపయోగించండి

కొబ్బరి నూనెను జుట్టు, చర్మ సమస్యలను తొలగిస్తుంది. దీనిలో కొవ్వు ఆమ్ల లక్షణాలు ఉంటాయి. అంతేకాదు ఎక్కువ మొత్తంలో విటమిన్ ఇ, విటమిన్ కె, మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్, సంతృప్త కొవ్వులు అలాగే ప్రోటీన్లు ఉంటాయి. కొబ్బరి నూనెను వంటల్లో వేసుకోవడం ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చర్మం యవ్వనంగా ఉంటుంది. 
 

skin care

అవిసె గింజలు 

జస్ట్ ఒక స్పూన్ అవిసె గింజలను తింటే మలబద్దకం తగ్గిపోతుంది. అలాగే సులువుగా బరువు తగ్గుతారు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. దీనిలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు.. ఒమేగా 3,  ఒమేగా 6 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో లిగ్నన్స్, ఫైటో ఈస్ట్రోజెన్లు, ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. 

చేపలు

కాడ్, సాల్మన్, ట్యూనా, హెర్రింగ్ వంటి చేపలు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు  పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలను తినడం వల్ల వాపు తగ్గిపోతుంది. టాక్సిన్స్ కూడా బయటకు వస్తాయి. వీటిని తినడం వల్ల చర్మం తేమ అలాగే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.
 

skin care

 దోసకాయ 

దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక దోసకాయలో 287 గ్రాముల నీరు ఉంది. దీనిలో ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, సెలీనియం, భాస్వరం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ తో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. 

click me!