మీది ఎలాంటి చర్మమైనా సరే.. కాఫీ ఫేస్ మాస్క్ తో అందంగా మారిపోవాల్సిందే..!

First Published Jan 20, 2023, 9:59 AM IST

డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అంటూ ఎలాంటి చర్మానికైనా కాఫీ ఫేస్ మాస్క్ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కాఫీ ఫేస్ మాస్క్ ను తయారుచేకోవచ్చు కూడాను. కాఫీ ఫేస్ మాస్క్ తో మొటిమలు, బ్లాక్ హెడ్స్, తెల్ల మచ్చలు, ఆయిలీ స్కిన్ వంటి ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. 
 

coffee

ఉదయం కప్పు కాఫీ తాగనిదే ఏ పని చేయని వారు చాలా మందే ఉన్నారు. కాఫీ మనల్ని హుషారుగా ఉంచుతుంది. ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఇది మన చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా..? డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ అంటూ రకరకాల చర్మాలను కలిగున్న వారికి కాఫీ ఫేస్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని తెల్లగా చేయడమే కాదు. బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఇందుకోసం ఇంట్లోనే కాఫీ ఫేస్ మాస్క్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం... 

coffee face pack

బ్లాక్ హెడ్స్ కోసం కాఫీ ఫేస్ మాస్క్

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది రంధ్రాలను తొలగించడానికి, బ్లాక్ హెడ్స్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అయినప్పటికీ మొటిమలను వదిలించుకోవడానికి ఇది ఎంతమాత్రం సహాయపడదు. మొటిమలు, nodules, cysts తో బాధపడుతున్న వాళ్లు కాఫీ మాస్క్ లు లేదా ఏదైనా హోం రెమెడీస్ కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ హెడ్స్, తేలికపాటి మొటిమల వల్ల అయిన మచ్చలను తగ్గించడానికి కాఫీ ఫేస్ మాస్క్ ను ఉపయోగించొచ్చు. 

బ్లాక్ హెడ్స్ కు కాఫీ ఫేస్ మాస్క్ తయారుచేసే విధానం

బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ ఉంటే.. రెండు టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసినన కాఫీ పౌడర్ లో, స్వచ్ఛమైన కలబంద జెల్ మిక్స్ చేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
 

చర్మం తెల్లబడటానికి కాఫీ ఫేస్ మాస్క్

కెఫిన్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది యువిఎ, యువిబి కిరణాల హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది చర్మంలోని వర్ణద్రవ్యం మెలనిన్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే ఇది హైపర్పిగ్మెంటేషన్, మచ్చలు, నల్ల మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

చర్మం తెల్లబడటానికి కాఫీ ఫేస్ మాస్క్ తయారుచేసే విధానం

చర్మం తెల్లబడటానికి.. ముందుగా ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును, ఒక టీ స్పూన్ పసుపును కలపండి. ఇది ముద్దలు లేకుండా చూసుకోండి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిముషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ తో శుభ్రం చేసుకోండి.
 

పొడి చర్మానికి కాఫీ ఫేస్ మాస్క్

ఒక్క్ కాఫీ ఫేస్ మాస్క్ లను ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించండి. దీనిలో మాయిశ్చరైజింగ్ పదార్థాలను మిక్స్ చేయండి. ఈ ఫేస్ మాస్క్ డ్రై స్కిన్ ఉన్న వారు ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా, స్మూత్ గా అనిపిస్తుంది. కాఫీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కానీ పొడి చర్మానికి దీన్ని ఉపయోగించే ముందు చర్మ వ్యాధి నిపుణుల సలహాను తీసుకోండి. 

పొడి చర్మానికి కాఫీ ఫేస్ మాస్క్ తయారుచేసే విధానం

ముందుగా ఒక టేబుల్ స్పూన్ తాజాగా రుబ్బిన కాఫీలో ఒక టీస్పూన్ కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె లేదా బాదం నూనెను కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిముషాలు అలాగే వదిలేయండి. తర్వాత మెత్తగా స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. 
 


సాధారణ చర్మానికి కాఫీ ఫేస్ మాస్క్

మీకు నార్మల్ స్కిన్ ఉంటే.. స్కిన్ టోన్ ను తొలగించడానికి, మచ్చలేవైనా ఉంటే తగ్గించడానికి, చర్మం మరింత ప్రకాశవంతంగా మెరవడానికి మీరు కాఫీ ఫేస్ మాస్క్ లను ఉపయోగించొచ్చు.

నార్మల్ స్కిన్ కోసం కాఫీ ఫేస్ మాస్క్ తయారుచేసే విధానం

తాజాగా రుబ్బిన కాఫీలో పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. దీన్ని మీ ముఖానికి, మెడకు అప్లై చేయండి. అయితే ఇది సమానంగా వ్యాపించేలా చూసుకోండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. 

తేనెలో మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కలయిక మీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇది మచ్చలను కూడా తొలగిస్తుంది. స్కిన్ టాన్ ను తొలగిస్తుంది.

click me!