ఇండియాలో ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తింటారు. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏదో ఒక ఆయిలీ ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది. పూరీ, పకోడి, మిర్చి బజ్జీ, సమోసా, పునుగులు వంటివినూనెతోనే తయారవుతాయి. అయితే ఆహారంలో నూనె లేకపోతే ఫుడ్ టేస్టీగా ఉండదని చెప్తారు. కానీ ఈ నూనె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.ఇలాంటి పరిస్థితిలో నెల రోజుల పాటు నూనె లేని ఆహారాలను తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఆరోగ్య నిపుణులు దీనిపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆయిల్ ఫుడ్ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకుంటే శరీరంపై మంచి ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయిలీ ఫుడ్ ను తీసుకోవడం మానేసినప్పుడు మీ గట్ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే తక్కువ నూనెతో తయారైన ఆహారాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
నూనె లేని ఆహారాలను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఫుడ్ లో ఆయిల్ ను తొలగించడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది గుండె పనితీరును మునుపటి కంటే మెరుగ్గా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పుకూడా చాలా వరకు తగ్గుతుంది.ఇది బీపీని అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది.
మీరు ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉన్నప్పుడు.. మీరు బరువు కూడా తగ్గుతారు. ఆహారం నుంచి కొవ్వును తగ్గించడం వల్ల కేలరీలు తీసుకోవడం చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల మీరు ఒకనెలలోనే కొన్ని కిలోల బరువు తగ్గుతారు. అంతేకాదు మీరు ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉండటం వల్ల మీరు మరింత శక్తివంతంగా తయారవుతారు.
skin care
ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉండటం వల్ల మీ చర్మం మునుపటి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గడం కూడా ప్రారంభమవుతుంది. దీనివల్ల మీ చర్మం శుభ్రంగా, క్లియర్ గా కనిపిస్తుంది. శరీరానికి కొవ్వు కూడా అవసరం. అందుకే నెయ్యి లేదా నూనెను ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ పరిమితిలోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.