Latest Videos

‘మంజుమ్మల్ బాయ్స్’ టీమ్ కు ఇళయరాజా లీగల్ నోటీసులు

By Surya PrakashFirst Published May 23, 2024, 10:59 AM IST
Highlights

లేదంటే కాపీరైట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. 


రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన చిత్రాల్లో మంజుమ్మల్ బాయ్స్ ఒకటి.  నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో భారీ వసూళ్లు రాబట్టింది.తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడా బాగానే ఆడింది.  తమిళంలో అయితే పెద్ద హిట్ అయ్యింది. అందుకు కారణం సినిమా టైట్ స్క్రీన్ ప్లే తో సాగే సర్వైవల్ థ్రిల్లర్ కావటంతో పాటు సినిమాలో గుణ కేవ్స్. అలాగే కమల్ గుణ సినిమాలో సాంగ్ ని టైమ్ చూసి ఫెరఫెక్ట్ గా వాడటం. 

థియేటర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చింది.ఓటిటీలో కూడా ఈ సినిమాకు ఓ రేంజిలో  రెస్పాన్స్ వచ్చింది.ఇలా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ యూనిట్ కు అనుకోని షాక్ తగిలింది. మంజుమ్మల్ బాయ్స్ చిత్రబృందానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా లీగల్ నోటీసులు పంపించారు.

ఈ సినిమా క్లైమాక్స్‏లో తాను కంపోజ్ చేసిన “గుణ” చిత్రంలోని కన్మణి అన్బోడు పాటను తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు.కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెంది ఉంటాయి. తమ సినిమా లో ఈ పాటను ఉపయోగించాలంటే హక్కులు పొందిన వ్యక్తికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. లేదంటే కాపీరైట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. 

ఇక  కేరళ నుంచి తమిళనాడులోని కొడైకెనాల్‏ను సందర్శించిన కొందరు స్నేహితులు గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. అక్కడే తమ స్నేహితుడు ఆ గుహలలో పడిపోవడంతో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తమ స్నేహితుడిని రక్షించుకున్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.  
 

click me!