Latest Videos

శ్యామలని ఎందుకు రేవ్ పార్టీ ఇష్యూలోకి లాగారు ? అసలు కారణం ఇదేనా

First Published May 23, 2024, 10:06 AM IST

ఇదే సమయంలో మంత్రి కారులో తెలుగు ప్రముఖ యాంకర్ కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. 
 

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు నటీనటులకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఈ  రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు కొందరు ఉన్నారు అంటూ ప్రచారం ఇబ్బందుల్లో పడేస్తోంది. ముఖ్యంగా హేమ ముందు నుంచి హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అలాగే ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో ఎవరికి వాళ్లు తాము ఆ  పార్టీలో లేము అంటూ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇస్తున్నారు. 


ఇప్పటికే ఈ పార్టీకి తాము హాజరు కాలేదని హేమ, శ్రీకాంత్‌ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.  అయితే  కొందరు ఇదే సమయంలో కావాలనే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున క్రియేట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.  అలాగే యాంకర్‌ శ్యామలపై కొందరు అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఆమె రేవ్‌ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు.


ఈ నేపథ్యంలో శ్యామల ఒక వీడియో రిలీజ్ చేసి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు పార్టీ ఎప్పుడు జరిగిందో? ఎక్కడ జరిగిందో? అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటూ ఒక ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తోంది, అసత్య ప్రచారం చేస్తున్నారు.

ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానం అయి ఉన్నాననే విషయం తెలిసి మా పార్టీ మీద, నా మీద బురదజల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసే అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ల మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది.


 జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఇలా అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు కాదు. దయచేసి మీ అసత్య ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించవద్దు అంటూ ఆమె వీడియోలో మాట్లాడారు. ఇక మరో ఛానల్ లో ఆమె మాట్లాడుతూ 2019లో నేను వైసీపీలో చేరుతున్నప్పుడు వైఎస్ జగన్ గారితో కలిసి ఉన్న ఫొటోతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు.

ఇక  ఈ రేవ్ పార్టీకి రాజకీయరంగు పులుమేస్తున్నారు. రేవ్ పార్టీ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. జానీ మాస్టర్ ఆ రేవ్ పార్టీలో దొరికాడంటూ కొన్ని పోస్ట్‌లు దర్శనం ఇవ్వగా.. వాటిని ఖండిచారు జానీ మాస్టర్. తాజాగా యాంకర్ శ్యామల సైతం ఆ రేవ్ పార్టీలో ఉందంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేయడంతో వాటిని ఖండించింది యాంకర్ శ్యామల.


ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా.. వీళ్ల పేర్లే ఈ రేవ్ పార్టీ వ్యవహారం ఎందుకు వినిపిస్తున్నాయి? అనేదే హాట్ టాపిక్ గా మారింది. అలాగే   వీళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే.. ఏపీ ఎన్నికల నేపథ్యంలో యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరుఫున ప్రచారం చేయగా.. జానీ మాస్టర్ జనసేన తరుఫున ప్రచారం చేయటమే కారణం అంటున్నారు. దాంతో వీళ్లిద్దర్నీ బెంగుళూరు రేవ్ పార్టీలో ఇష్యూలోకి లాగుతూ.. తప్పుడు కథనాలను ప్రసారం చేసి.. వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. 

pawan shyamala


జానీ మాస్టర్, హీరో శ్రీకాంత్ పేర్లు కూడా తెరపై వచ్చాయి. కానీ తాము ఆ రేవ్ పార్టీలో లేమని వీరిద్దరు ప్రకటించారు. మరోవైపు వైసీపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎమ్మెల్యేకు సంబంధించిని స్టికర్ కార్డు కారు రేవ్ పార్టీలో దొరకడంతో ..ఇది పొలిటికల్‌గా పెద్ద ఇష్యూగా మారింది. దీనిపై రాజకీయంగా విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో మంత్రి కారులో తెలుగు ప్రముఖ యాంకర్ కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. 

శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆమె టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆమె వైసీపీకి సపోర్టు చేసిన దగ్గర నుంచి కూడా ఓ వర్గం శ్యామలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు.  కొందరు శ్యామల వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేశారు.

శ్యామల చీకటి భగోతాలు ఎవరికి తెలియవంటూ ఉండవల్లి అనూష, నటుడు పృథ్వీ వంటి వారు ఆమెనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల ఉన్నట్టు ఆమె వ్యతిరేక మీడియా ప్రచారం చేశారు. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. 


ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఇంత దిగజారిని రాజకీయాలు చేస్తున్నారు అంటే.. ఒక పార్టీకి నేను సపోర్ట్ చేశాను అని ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు న్యాయమేనా? దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి. అసలు ఆ రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కొందరు కావాలనే ఇలా చేస్తూ నన్ను బాధపెడుతున్నారు. ఇక నుంచి అయినా ఇలాంటివి చేయడం మానేయండి.
 

అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయదు. నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. శ్యామల కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది. 

తరచుగా శ్యామల కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆమె భర్త నటుడు నరసింహ ఆ మధ్యన ఓ చీటింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్యామల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా శ్యామల షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

బిగ్ హౌజ్ లోనూ తన మార్క్ చాటుకుంది. ఎప్పుడూ ఫన్నీగా ఉంటూ హౌస్ లో సందడి నెలకొల్పడంలో శ్యామల ప్రయత్నం ఆడియెన్స్ ను మరింతగా అలరించింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్యామల సెలబ్రెటీ జాబితాలోకి చేరిపోయింది. చాలా డీసెంట్ గా, గ్లామర్ గానూ బుల్లితెరపై అలరించే శ్యామల ఆడియెన్స్ అటెన్షన్ డ్రా చేయడంలో మేటీ అని చెప్పొచ్చు. 
 

ఏపీలోని కాకినాడకు చెందిన శ్యామల వ్యాఖ్యాతగా తన ప్రతిభను చూపిస్తూ.. టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటికే ఒకింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ యాంకర్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 (Bigg Boss Telugu 2) లో అవకాశం దక్కించుకుంది. 
 

స్పెషల్ యాంకరింగ్ స్కిల్స్ తో  తెలుగు టీవీ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరయ్యారు శ్యామల (Anchor Shyamala). ఆ మధ్యన  డైరెక్టర్ ఆర్జీవీ తనపై కామెంట్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా శ్యామల కూడా ఆర్జీవీపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. ఆయన సినిమాలపైనా కామెంట్ చేసింది.
 

click me!