జుట్టు ఆరోగ్యంగా , అందంగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అలా అందంగా ఉండాలి అంటే... మనం జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జట్టు పాడవ్వకుండా, మృదువుగా ఉండాలి అంటే... షాంపూ మాత్రం చేస్తే సరిపోదు. ఆ జుట్టుకి కండిషనర్ కూడా చాలా అవసరం. కండిషనర్ అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అయితే... కండిషనర్ అప్లై చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే... జుట్టు పెరగడం కాదు... రాలిపోతాయి. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి, ఆ జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం...