3. వెజిటబుల్ సూప్
కావల్సిన పదార్థాలు
వంకాయ - 1/4 కప్పు
బీన్స్ - 1/4 కప్పు
టమాటాలు - 1/4 కప్పు
ఉల్లిపాయలు - 1/4 కప్పు
క్యారెట్ - 1/4 టీస్పూన్
పచ్చి బఠానీలు - తగినంత
శనగపప్పు - తగినంత
కారం - తగినంత
ధనియాల పొడి - తగినంత
కొబ్బరి - తగినంత
ధనియాల పొడి - 1 టీ స్పూను
వెల్లుల్లి - కొద్దిగా
అల్లం - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారుచేసే విధానం
బాణలిలో నూనె వేడిచేసి అందులో ఆవాలు, మినప్పప్పు, కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు వేసి వేయించండి. తర్వాత తరిగిన కూరగాయలు వేసి బాగా వేయించి అవి ఉడికిన తర్వాత నీళ్లు పోయండి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపండి. కొబ్బరి, సోంపు గింజలు, అల్లం, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. కూరగాయలు ఉడికిన తర్వాత గ్రైండ్ పేస్ట్ ను వేసి బాగా ఉడికించింది. ఇది రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లితే రుచికరమైన వెజిటేబుల్ సూప్ రెడీ అయినట్టే..