సెక్స్ లైఫ్ బాగుండాలంటే ఇలా చేయాల్సిందే..!

First Published Nov 12, 2022, 4:57 PM IST

మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాల్లో సెక్స్ ఒకటి. ఎందుకంటే సెక్స్ వల్ల భార్యా భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. మనస్పర్థలుండవ్. దీనివల్ల గుండె జబ్బుల నుంచి ఎన్నో రోగాల ప్రమాదం కూడా తగ్గుతుంది. 

sex life

మనలో చాలా మంది సెక్స్ గురించి మాట్లాడటానికి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ను చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు. కారణం ఇది మాట్లాడుకోవాల్సిన విషయం కాదని. కానీ సెక్స్ కు సంబంధించిన సమస్యలను అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది భార్యా భర్తల మధ్య ప్రేమను రెట్టింపు చేస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది. అన్నింటికి మించి వారి బంధం బలంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతకాదు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. అందుకే ఇది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి అంటారు నిపుణులు. సెక్స్ గురించి అవగాహన లేకపోవడం భాగస్వాముల మధ్య ఎన్నో మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గడం వల్ల కూడా చాలా మంది పురుషులకు మానసికంగా అలసిపోయే అవకాశం ఉంది. లైంగిక సామర్థ్యం తగ్గడం వల్ల శక్తి లేకపోవడం, అంగస్తంభన సమస్యలకు దారితీస్తుంది. మీ సెక్స్ లైఫ్ బాగుండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

sex life

నిద్ర

సెక్స్ లైఫ్ ను మెరుగుపరచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర లిబిడోను చాలా ప్రభావితం చేస్తుంది. కంటినిండా నిద్రపోని వ్యక్తులు లైంగికంగా తక్కువ సామర్థ్యం కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. నిద్ర విధానాలు కొన్ని లైంగిక సంబంధిత హార్మోన్లనే ఎప్పుడు విడుదల చేయాలో నిర్ణయించడానికి శరీరానికి సహాయపడతాయి. అందుకే వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
 

ఒత్తిడి

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు లైంగిక సమస్యలకు కారణమవుతాయి. వీటివల్ల పురుషులకు సెక్స్ పై ఇంట్రెస్ట్ ఉండదు. స్పెర్మ్ కౌంట్ కూడా బాగా తగ్గుతుంది. పురుషులు తమ స్పెర్మ్ నాణ్యతను, సెక్స్ లెఫ్ ను మెరుగుపరచడానికి ఇలాంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు.
 

healthy food

ఆరోగ్యకరమైన ఆహారం

కొవ్వు ఎక్కువగా ఉండే  ఆహారం తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. యాంటీఆక్సిడెంట్లు స్పెర్మ్ ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఆకుకూరలు, బెర్రీలు, సిట్రస్ పండ్లు, ఆలివ్ ఆయిల్, టమాటాలు వంటి ఆహారాలను తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 
 

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. దీనివల్ల సెక్స్ లైఫ్ కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం వల్ల మీరు చురుగ్గా సెక్స్ లో పాల్గొంటారు. ఇది మీ స్పెర్మ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బాగా చెమట పట్టే విధంగా రోజుకు 15 నిమిషాలు వ్యాయామం చేయండి. ఇది మీ లైంగిక శక్తిని పెంచుతుంది.
 

alcohol

ఆల్కహాల్

ఆల్కహాల్ నేరుగా పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది లిబిడోను తగ్గిస్తుంది. అలాగే టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. మొత్తంగా మితిమీరిన ఆల్కహాల్ మీ మొత్తంలో ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా మీ సెక్స్ లైఫ్ ను నాశనం చేస్తుంది. అందుకే ఈ అలవాటును మానుకుంటే మంచిది.

click me!