Old mask side effects: ఒక్క మాస్క్ నే వాడుతున్నారా..? అయితే జాగ్రత్త మీకు ఆప్రాబ్లమ్స్ వస్తయ్..

First Published Jan 13, 2022, 3:04 PM IST


 Old mask side effects:మాస్క్ లేకపోతే ఫైన్లు పడతయ్ జాగ్రత్త.. మాస్కులతోనే మీరు సురక్షితంగా ఉంటారు.. అన్న వ్యాఖ్యలు ఇప్పుడు తరచుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా మహమ్మారి నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉండాలంటే మాత్రం Mask తప్పనిసరి. ఒకవైపు కరోనా మరోవైపు డెల్టా వేరియంట్.. ఇంకో వైపు ఒమిక్రాన్.. వీటిని నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అయితే ఎక్కువ సేపు మాస్క్ ను ధరించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది

Old mask side effects:కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ దేశాల పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. 2020 నుంచి ఈ మహమ్మారి ప్రజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కరోనా రోజు రోజుకు రకరకాల మ్యుటేషన్లతో అత్యంగా వేగంగా వ్యాపిస్తోంది. దీని బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో దిక్కులేని పక్షులయ్యారు. అందుకే ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ అప్రమత్తం అయ్యాయి. దీని బారిన పడకుండా కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. అయినా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. 
 

రెండు డోసుల టీకాలు వేయించుకున్నా.. వైరస్ సోకుందని అధ్యయనాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అందుకే Social Distance, sanitation, Mask లు తప్పని సరిగా పాటించాలి. ఇందులో మాస్క్ must అని తేల్చి చెప్పాయి. కాగా కరోనా వైరస్ యే కాక, డేల్టా వేరియంట్, ఒమిక్రాన్ కేసులు కూడా రోజు రోజుకు దారుణంగా పెరుగుతున్నాయి. అందుకే మాస్క్ తోనే మనం సురక్షితంగా ఉండగలం. మాస్క్ ధరిస్తే ఈ మహమ్మారి నుంచి సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండొచ్చు. అయితే మాస్క్ సురక్షితమే అయినప్పటికీ తరచుగా ఒకే మాస్క్ వాడటం అంత మంచిది కాదు. దీనిపై అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

మాస్కులు ఎక్కువ సేపు ధరించడం మూలంగా చర్మంపై దురద వస్తుంది. అలాగే మాస్క్ ధరించిన ప్లేస్ లో అలర్జీలు వస్తాయని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆ నిర్ధిష్ట ప్లేస్ లో చర్మంపై చమట ఎక్కువగా పడుతుంది. దాంతో అక్కడ చర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు కూడా రావొచ్చు.  అయితే చాలా మంది Clothe తో చేసిన మాస్కులనే వాడుతున్నారు. అయితే ఒకే మాస్క్ లను గంటల తరబడి వాడటం వల్ల ముఖం మీద  Infection అయ్యే ప్రమాదముంది. 

ఎందుకంటే బయటకు వెళ్లినప్పుడు ముఖంపై వైరస్ వ్యాపిస్తుంది. అది కాస్త మాస్క్ కు అంటుకుంటుంది. అందుకే యూజ్ చేసిన మాస్క్ ను వాష్ చేయడం మర్చిపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే Reuse మాస్కులు వాడటం కంటే ఒకేసారి వాడి పారేసే సర్జికల్ మాస్కులనే వాడాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. కాటన్ మాస్క్ లను కూడా ఉపయోగించొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండాలంటే మాత్రం మాస్క్ ను ఒకే సారి వాడాలని చెబుతున్నారు. ఒకవేళ మీరు బట్టతోనే తయారు చేసిన మాస్క్ లనే వాడాలనుకుంటే వాటిని ఖచ్చితంగా శుభ్రపరిచి ఉపయోగించడం బెటర్. 
 

click me!