అధిక బరువుతో బాధపడేవారు వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే డైలీ ఎక్సర్ సైజ్లు చేసే వారిలో గుండె సంబంధిత సమస్యలు చాలా వరకు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. నిద్రలేమి, డయాబెటిస్, మానసిక సమస్యలు వంటి అనేక సమస్యలను డైలీ వ్యాయమం చేయడం ద్వారా తరిమికొట్టొచ్చు. అందుకే చాలా మంది ఉదయం, సాయంత్రం రెండు వేళల్లో వ్యాయామాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే వ్యాయామం రెండు గంటలకు మించి చేస్తే ముప్పు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు గంటలు చేస్తే ఎటువంటి సమస్యలు రావు.. కానీ ఈ టైం మించితేనే అసలుకే ఎసరు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.