ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ని సుకుమార్ అమ్మవారి గెటప్ లో చూపించి కావలసినంత హైప్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా విడుదలైన పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ మరో సంచలనంగా మారింది. అలాంటి ఇలాంటి సంచలనం కాదు.. ఈ సాంగ్ ఏకంగా 15 దేశాల్లో ట్రెండ్ అవుతున్నట్లు రిపోర్ట్స్ అందుతున్నాయి.