ఉదయం లేవగానే ఫోన్ చెక్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా??..

First Published Apr 6, 2021, 11:16 AM IST

ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఇటీవల చాలా కామన్ అయ్యింది. ఫోన్ లేకుండా.. ఎప్పటికప్పుడు ఫేస్బుక్, వాట్సప్, ఇన్ స్టా.. ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతుందో చెక్ చేసుకోకపోతే అస్సలు మనసున పట్టదు. పని ఉన్నా లేకపోయినా.. ఎంత పనిలో ఉన్నా ప్రతీ ఐదు నిముషాల కోసారి తప్పనిసరిగా ఫోన్ చెక్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. 

ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఇటీవల చాలా కామన్ అయ్యింది. ఫోన్ లేకుండా.. ఎప్పటికప్పుడు ఫేస్బుక్, వాట్సప్, ఇన్ స్టా.. ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతుందో చెక్ చేసుకోకపోతే అస్సలు మనసున పట్టదు. పని ఉన్నా లేకపోయినా.. ఎంత పనిలో ఉన్నా ప్రతీ ఐదు నిముషాల కోసారి తప్పనిసరిగా ఫోన్ చెక్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.
undefined
ఇది రాత్రి పడుకునే వరకు ఇలాగే కొనసాగుతుంది. ఏ అర్థరాత్రో ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటేకానీ దీనికి బ్రేక్ పడదు. అయితే ఉదయాన్నే లేవగానే ఫోన్ చెక్ చేస్తుంటారు చాలామంది. 80 శాతంమందికి లేచిన 15 ని.లలోపు ఫోన్ లో అప్ డేట్స్ చెక్ చేయకపోతే తోచదు.
undefined
అయితే ఈ అలవాటు వల్ల శరీరానికి ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా.. అంటున్నాయి తాజాగా చేసిన కొన్ని పరిశోధనలు. ఆ దుష్ప్రభావాలను ఇలా చెబుతున్నాయి..
undefined
ఒత్తిడిని పెంచుతుంది.. ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్ ఫోన్ చెక్ చేసుకోవడం వల్ల శరీరం మీద ఒత్తిడి బాగా పెరుగుతుందని ఈ పరిశోధన ద్వారా నిరూపించబడింది.
undefined
ఉదయం లేచిన వెంటనే డాటానో, వైఫై నో ఆన్ చేయగానే.. ఎన్నో మెసేజ్ లు, ఎంతో సమాచారం ఒక్కసారిగా ఫోన్ లో నిండిపోతుంది. అది మిమ్మల్ని మనసును ఉద్రేకపరుస్తుందని వీరు అంటున్నారు.
undefined
వాస్తవానికి, మీరు ఉదయం లేచినప్పుడు, సోషల్ నెట్‌వర్కింగ్ సందేశాలు, ఇమెయిళ్ళు లేదా వచన సందేశాలను చూసినప్పుడు, అకస్మాత్తుగా చాలా సమాచారం ఉంది, అది మనస్సును ఉద్రిక్తంగా చేస్తుంది.
undefined
ఉదయం లేవగానే ఫోన్ చూడడం వల్ల అందులోని సందేశాలను బట్టి మీ రోజంతా ప్రభావితం అవుతుందట.. ఒత్తిడితో, కంగారుతో రోజు ప్రారంభవుతుందిట.
undefined
లేవగానే నిద్ర కళ్లతోనే ఫోన్ చెక్ చేయడం వల్ల కంటిపై చెడు ప్రశావం పడి, కంటి చూపును ప్రభావితం చేస్తుందట. అంతేకాదు క్యాన్సర్ కు దారి తీస్తుంది.
undefined
స్మార్ట్ ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మెడ దృఢత్వం తగ్గిపోవడం, నొప్పి, ఊబకాయం, క్యాన్సర్, విద్యుదయస్కాంత వికిరణం, నిద్ర లేమి, మెదడులో మార్పులు వంటి సమస్యలు వస్తాయి.
undefined
మరి ఎలా ఉదయం లేవగానే ఫోన్ వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే..ఉదయం లేచిన వెంటనే ఫోన్ వైపు చూడకండి. కావాలంటే కాస్త ఆలస్యంగా లేవండి. లేచినా ఫోన్ ఉందన్న సంగతి మరిచిపోండి.
undefined
ఉదయాన్నే లేవాలని ఫోన్ లో అలారం పెట్టుకోకండి. మీరు అలారం పెట్టుకోవాలనుకుంటే అలారం క్లాక్ కొనుక్కోండి. దీనివల్ల ఫోన్ ను ఉదయమే చూడడాన్ని అవైడ్ చేయచ్చు.
undefined
లేవగానే ఫోన్ మీదికి దృష్టి వెళ్లకుండా వ్యాయామాలో, గార్డెనింగో లాంటి పనులతో ఆరోగ్యవంతమైన దినచర్యగా మార్చుకోండి.
undefined
click me!