ఎండాకాలంలో జుట్టుకు నూనె పెట్టుకోవాలా?

First Published | Apr 30, 2024, 4:43 PM IST

ఏప్రిల్ నెల స్టార్టింగ్ నుంచి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అయితే చాలా మంది ఎండాకాలంలో జుట్టుకు అస్సలు నూనె పెట్టరు. ఎందుకంటే దీనివల్ల జుట్టు బాగా చెమట పట్టి జిడ్డుగా మారుతుందని. కానీ.. ఈ సీజన్ లో జుట్టుకు నూనె పెడితే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు.
 

Image: Getty

మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నూనె పెట్టాలని చెప్తుంటారు. కానీ చాలా మంది ఎండాకాలంలో మాత్రం జుట్టుకు నూనె పెట్టడానికి అస్సలు  ఇష్టపడరు. ఎందుకంటే ఈ సీజన్ లో జుట్టుకు నూనె పెడితే జిడ్డుగా మారుతుంది. అలాగే నెత్తిమీద చెమట కూడా ఎక్కువగా పడుతుందని జుట్టుకు నూనెను పెట్టకుండా అలాగే వదిలేస్తారు. కానీ ఎండాకాలంలో జుట్టు బాగా పొడిబారుతుంది. అలాగే పొరలు పొరులగా మారుతుంది. ఎండాకాలంలో వచ్చేజుట్టు సమస్యల్లో ఇవి సర్వసాధారణమైనవి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. 
 

వేడి, చెమటతో ఎండాకాలంలో జుట్టుకు నూనె పెట్టుకోవడం అవసరమా? అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఈ సీజన్ లో కూడా జుట్టుకు ఖచ్చితంగా నూనె పెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ జుట్టు పొడిగా లేదా జిడ్డుగా ఉన్నా ఎండాకాలంలో ఖచ్చితంగా నూనె పెట్టాలి. ఎండాకాలంలో జుట్టుకు నూనె పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Latest Videos


హైడ్రేట్

ఎండాకాలం వేడి, సూర్యరశ్మి, స్విమ్మింగ్ వల్ల జుట్టులోని తేమంతా తొలగిపోతుంది. జుట్టు కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి, మీ జుట్టును హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎండాకాలంలో కూడా జుట్టుకు నూనె పెట్టండి. 

అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ

కొన్ని నూనెలలో సహజ యూవీ ఫిల్టర్లు ఉంటాయి. ఇవి యూవీ కిరణాల నష్టం నుంచి మన జుట్టును రక్షిస్తాయి. డ్రై హెయిర్, విచ్ఛిన్నం, వెంట్రుకల రంగు పాలిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న బాదం నూనె అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును కాపాడుతుందని 2022 లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రైకాలజీలో ప్రచురించిన పరిశోధన తెలిపింది.
 

hair packs

నెత్తి ఆరోగ్యం

మీ నెత్తికి నూనెను అప్లై చేయడం వల్ల చికాకు తగ్గుతుంది. అలాగే చుండ్రు తగ్గడానికి కూడా నూనె సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. నూనె నెత్తిమీద ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 
 

నూనెలు, జుట్టు రకాలు

మామూలు జుట్టు అయితే..

మీకు మామూలు జుట్టు ఉన్నట్టైతే దాని ఆరోగ్యం, షైనింగ్ ను మెరుగుపర్చడానికి ఎండకాలంలో తేలికపాటి నూనెను పెట్టండి. మీరు కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి నూనెలను జుట్టుకు పెట్టొచ్చు. 

పొడి జుట్టు ఉంటే..

ఎండాకాలం ఇప్పటికే పొడిబారిన జుట్టును మరింత ఎండిపోయేలా చేస్తుంది. ఆర్గాన్ ఆయిల్ లేదా జోజోబా ఆయిల్ వంటి లోతైన మాయిశ్చరైజింగ్ నూనెలు పొడి జుట్టును పోషిస్తాయి. అలాగే హైడ్రేట్ గా చేస్తాయి. 
 

జిడ్డు జుట్టు ఉంటే..

జిడ్డు జుట్టు ఉన్నవారికి ఎండాకాలంలో హైడ్రేషన్ అవసరం.  ద్రాక్ష విత్తన నూనె లేదా టీ ట్రీ ఆయిల్ వంటి నూనెలు మీ నెత్తికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అలాగే నూనె ఉత్పత్తిని నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
 

click me!