ఇవి వాడితే పురుషాంగం పెద్దగా అవుతుందా?

First Published Mar 18, 2023, 10:46 AM IST

రోజుల్లో పురుషాంగం పంపులకు బలే క్రేజ్ ఏర్పిడింది. చాలా మంది వీటిని యూజ్ చేస్తున్నారు. అయితే ఈ పంపులు అంగస్తంభనకు సహాయపడటమే కాకుండా.. పురుషాంగం పరిమాణాన్ని కూడా పెంచుతాయా అంటూ చాలా మందికి డౌట్స్ వస్తుంటారు. దీని గురించి నిపుణులు ఏంటున్నారంటే..!
 

penis

ప్రస్తుతం చాలా మంది పురుషులు అంగస్తంభన లోపం, పురుషాంగం చిన్నగా ఉండటం, సెక్స్ ను ఆస్వాధించకపోవడం, పునరుత్పత్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి ఇవన్నీ సెక్స్ ను ఆస్వాదించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వారే ఆనందమైన సెక్స్ కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పురుషాంగం పంపులను యూజ్ చేస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ పురుషాంగం పంపులు అంగస్తంభన పనితీరును, లైంగిక ఆనందాన్నిమెరుగుపరుచుకోవాలనుకునే వారే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  

PENIS

పురుషాంగం పంపులు అంటే ఏంటి? 

వాక్యూమ్ పంప్ నే సాధారణంగా పురుషాంగం పంప్ అని, అంగస్తంభన పంపు అని అంటారు. ఇవి అంగస్తంభనకు సహాయపడతాయి. దీనిలో ఒక చిన్న ప్లాస్టిక్ పరికరంలోకి పురుషాంగాన్ని చొప్పిస్తారు. వాక్యూమ్ ప్రెజర్ ను ఉపయోగించి అంగస్తంభన  అయ్యేలా చేస్తారు. వీటిని ఎక్కువగా సిస్ జెండర్ వ్యక్తులు, పురుషాంగం ఉన్నవారు ఉపయోగిస్తారు. కానీ ఎక్కువగా అంగస్తంభనను పొందడంలో ఇబ్బంది ఉన్నవారే వీటిని యూజ్ చేస్తారు. 
 

penis

పురుషాంగం పంపులు ఎలా పని చేస్తాయి? 

ఇది పురుషాంగం కంటే కొంచెం పెద్దసైజులో పొడుగ్గా ఉంటుంది. దీనిలో పురుషాంగాన్ని చొప్పిస్తారు. ఇది మాన్యువల్ లేదా బ్యాటరీతో నడుస్తుంది. ఈ ప్లాస్టిక్ సిలిండర్ లో ఉండే గాలిని బయటకు పంపుతారు. ఇది ప్రతికూల ఒత్తిడికి దారితీస్తుంది. ఇది పురుషాంగంలోకి రక్తాన్ని లాగుతుంది. ఇది అంగస్తంభనకు దారితీస్తుంది. ఈ పురుషాంగం పంపులు రకరకాల సైజులు, డిజైన్లలో ఉంటాయి. అయితే ఓవర్ పంపింగ్ ను ఆపడానికి ప్రెజర్ గేట్ లేదా రిలీజ్ వాల్వ్ వంటివి కూడా దీనికి ఉంటాయి. ఇవి అంగస్తంభనకు సహాయపడతాయి. 

పురుషాంగం పంపును ఎలా ఉపయోగించాలి? 

ముందుగా నీటిలో కరిగే లూబ్రికేషన్ ను కొద్దిగా తీసుకుని పురుషాంగం చుట్టూ, పురుషాంగం పంపు చుట్టూ అప్లై చేయండి. అలాగే ట్యూబ్ లో పురుషాంగాన్ని ఎక్కువగా లాగకూడదు. పంపుతో ట్యూబ్ నుంచి గాలిని లాగడం వల్ల వాక్యూమ్ ఏర్పడుతుంది. దీంతో పురుషాంగానికి రక్తం ప్రవహించడం ప్రారంభమవుతుంది. దీంతో అంగస్తంభన ఏర్పడుతుంది. అయితే ట్యూబ్ ను తీసేసేముందు అంగస్తంభనను అలాగే ఉంచడానికి బ్యాండ్ ను ట్యూబ్ నుంచి పురుషాంగం బేస్ పైకి జరపండి. లూబ్రికెంట్ ను ఉపయోగిస్తే బ్యాండ్ ను సులువుగా తీసేయొచ్చు. ఒత్తిడిని ఎక్కువగా చేయకూడదు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. 30 నిమిషాల తర్వాత బ్యాండ్ ను ఖచ్చితంగా తీసేయాలి. 

పురుషాంగం పంపుల ప్రయోజనాలు

అంగస్తంభన లోపంతో బాధపడుతున్నవారికి ఇది మంచి మేలు చేస్తుంది. పురుషాంగం పంప్ జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది పురుషాంగంలోని రక్తనాళాలను ఉబ్బేలా చేస్తుంది. ఇది అంగస్తంభనకు దారితీస్తుంది. అంగస్తంభన సమయంలో పురుషాంగం వక్రంగా ఉండే పెరోనీ వ్యాధి ఉన్నవారికి పురుషాంగం పంపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం.. 12 వారాల పాటు వాక్యూమ్ పంప్ ను ఉపయోగించడం వల్ల పురుషాంగం పొడవు, యాంగిల్, అసౌకర్యం మెరుగుపడ్డాయి.
 

పురుషాంగం పంపులు పురుషాంగాన్ని పెంచుతాయా? 

కొంతమంది తయారీదారుల ప్రకారం.. పురుషాంగం పంపులు పురుషాంగాన్ని పెద్దదిగా చేయడానికి కూడా సహాయపడతాయి. మరో అధ్యయనం ప్రకారం.. పురుషాంగం పంపులను ఆరు నెలలు ఉపయోగించిన తర్వాత పురుషాంగం పొడవు 7.6 నుంచి 7.9 సెంటీమీటర్లకు పెరిగింది. ఇది చాలా తక్కువ మార్పు. కానీ దీనివల్ల రోగులు శారీరకంగా, మానసికంగా ఎక్కువ సంతృప్తి చెందారని సూచిస్తుంది. 

click me!