అబ్బాయిలూ.. మీ ఫ్యామిలీకి ఎలాంటి న్యూ ఇయర్ గిఫ్ట్ లు ఇస్తే సర్‌ప్రైజ్‌ అవుతారో తెలుసా?

First Published | Dec 19, 2023, 10:57 AM IST

New Year 2024: న్యూ ఇయర్ కు ఫ్రెండ్స్ కే కాదు ఫ్యామిలీకి కూడా గిఫ్ట్ లను ఇవ్వొచ్చు. అందులోనూ ఫ్యామిలీ చాలా స్పెషల్ కాబట్టి.. వీరికి ఎలాంటి గిఫ్ట్ లను ఇస్తే హ్యాపీగా ఫీలవుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

gifts

New Year 2024: కొత్త సంవత్సరానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. అందుకే ఇప్పటి నుంచే న్యూ ఇయర్ గిఫ్ట్ లను కొంటుంటారు. అందులోనూ ఎవరెవరికి గిఫ్ట్ లను ఇవ్వాలో కూడా లిస్ట్ ను తయారుచేసిపెట్టుకుంటారు. ఫ్రెండ్స్ కే కాదు ఫ్యామిలీకి కూడా న్యూ ఇయర్ కి బహుమతులను ఇవ్వొచ్చు. నిజానికి చిన్న బహుమతి అయినా వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు వారి గురించి కూడా ఆలోచిస్తున్నారని వారికి అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే ఈ న్యూ ఇయర్ కు ఫ్యామిలీకి ఎలాంటి గిఫ్ట్ లను ఇస్తే వారు సంతోషిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అలంకరణ వస్తువులు

ఈ న్యూ ఇయర్ కు మీ భార్యకు లేదా మీ అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇంటిని అలంకరించడానికి కొన్ని వస్తువులనే బహుమతిగా ఇవ్వండి. ముఖ్యంగా మహిళలకు ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. అందుకే ఇలాంటి గిఫ్ట్ లను ఇస్తే  వారు సర్ప్రైజ్ అవ్వడమే కాకుండా ఎంతో ఆనందిస్తారు కూడా. 
 

Latest Videos


మేకప్ కిట్

మీరు మీ భార్యకు గిఫ్ట్ ను ఇవ్వాలనుకుంటే.. ఈ న్యూ ఇయర్ కు మేకప్ యాక్సెసరీలను ఇవ్వండి. ముందే ఆడవాళ్లకు మేకప్ వేసుకోవడమంటే ఎంతో ఇష్టముంటుంది. ఈ గిఫ్ట్ గనుక మీ వైఫ్ కు ఇచ్చారంటే ఆమె ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. 

చాక్లెట్

స్వీట్లతో కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేస్తే..  ఈ రోజును మీరు అస్సలు మర్చిపోలేరు. ఈ ప్రత్యేకమైన రోజును మరింత ప్రత్యేకంగా చేయడానికి మీ భాగస్వామికి నచ్చిన చాక్లెట్స్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. మీరు మీ తల్లిదండ్రులకు చాక్లెట్ను బహుమతిగా కూడా ఇవ్వవచ్చు.
 

ఇండోర్ మొక్కలు

మీ తల్లిదండ్రులకు గార్డెనింగ్ అంటే ఇష్టమా? అయితే ఈ న్యూ ఇయర్ గిఫ్ట్ గా వారికి చిన్న ఇండోర్ మొక్కలను బహుమతిగా ఇవ్వండి. ఈ గిఫ్ట్ వారికి బాగా నచ్చుతుంది. ఈ మొక్కలను కొనడానికి మీకు వంద నుంచి ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుందంతే. 

laughing buddha

లాఫింగ్ బుద్ధా

న్యూ ఇయర్ సందర్భంగా.. లాఫింగ్ బుద్ధాను మీ ఫ్యామిలీకి గిఫ్ట్ గా ఇస్తే కూడా ఆమె ఎంతో సంతోషంగా ఫీలవుతుంది. నిజానికి లాఫింగ్ బుద్ధ చాలా అందంగా ఉంటుంది. అలాగే దీనిని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. అందుకే మీరు దీన్ని మీ సన్నిహితులకు కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.
 

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు

మీ బడ్జెట్ బాగుంటే మీ భాగస్వామికి లేదా మీ కుటుంబానికి మొబైల్ ఫోన్లు, గడియారాలు లేదా హెడ్ఫోన్లు వంటి వాటిని కూడా ఇవ్వొచ్చు. అయితే ఇవి వారికి అవసరమున్నాయో లేదో తెలుసుకోండి. ఈ రకమైన బహుమతి వృథా కాదు. అలాగే వారికి ఎప్పుడూ ఉపయోగపడుతుంది. 
 

దుస్తులు 

న్యూ ఇయర్ రోజు మీ పేరెంట్స్ కు కొత్త బట్టలు కూడా ఇవ్వొచ్చు. దీనివల్ల మీరు కొత్త ఏడాదిని కొత్త బట్టలతో మొదలుపెడతారు. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త సంవత్సరం మళ్లీ మళ్లీ రాదు, కాబట్టి మీరు డబ్బుల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
 

click me!