చలికాలంలో జుట్టు సంరక్షణకు ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

First Published Nov 13, 2021, 6:45 PM IST

చలికాలంలో (Winter season) గాలిలోని తేమ కారణంగా మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే చలికాలంలో అందరిని మరింత ఇబ్బందులకు గురి చేసే సమస్య జుట్టు సమస్య (Hair problems). కనుక చలికాలంలో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. అప్పుడే మన జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంటుంది.
 

చలికాలంలో జుట్టు చిట్లినట్టుగా మారడం, పొడిగా ఉండటం చుండ్రు (Dandruff) వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కనుక చలికాలంలో జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా చలికాలంలో జుట్టు సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేస్తుంటాం. అయితే ఎక్కువ వేడిగా ఉండే నీరుతో తలస్నానం (Head bath) చేసుకోవడంతో జుట్టు (Hair) మరింత డ్రై అవుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు తల దువ్వరాదు. తడి ఉండగానే తల దువ్వుకోవడంతో జుట్టు ఎంతో సులువుగా ఊడిపోతుంది.
 

మనం స్నానం చేసేటప్పుడు గాఢత తక్కువగా ఉన్న షాంపూతో (Shampoo) స్నానం చేయడం మంచిది. చలికాలంలో చలి కారణంగా నీరు తక్కువగా తాగుతాము. అలాంటప్పుడు చర్మం డీహైడ్రేషన్ (Dehydration) కు గురి అవుతుంది. దీంతో తల కుదుళ్లకు తేమ అందక జుట్టు రాలిపోతుంటుంది.
 

కనుక ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవడం అవసరం. చలికాలంలో వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. హెయిర్ డ్రయ్యర్ (Hair dryer) ను ఉపయోగించకపోవడం మంచిది. తరచుగా నూనెతో మసాజ్ (Oil massage) చేసుకుంటూ ఉండాలి.
 

అప్పుడే జుట్టు కుదుళ్లకు తగిన తేమ అంది జుట్టు బలంగా ఒత్తుగా పెరుగుతుంది. బయటకు వెళ్లేటప్పుడు తలకు స్కార్ఫ్ (Scarf), టోపీలు (Caps) ధరించడం మంచిది. చలికాలంలో తల పొడిబారి దురద పెడుతుంది. దాంతో చుండ్రు సమస్య (Dandruff problems) మొదలై జుట్టు రాలిపోవడం.
 

ఈ సమస్యను నివారించడానికి రెండు స్పూన్ ల ఆలివ్ ఆయిల్ (Olive oil), ఒక నిమ్మరసం (Lemon juice) తీసుకొని కలుపుకోవాలి. దీన్ని గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి. ఇలా ఐదు నిమిషాల పాటు మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు సమస్యలు తగ్గుముఖం పడతాయి.
 

బాగా పండిన అరటిపండును (Banana) తీసుకుని తలకు పట్టించుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. జుట్టు కుదుళ్లకు తగిన పోషకాలు అందించి జుట్టు రాలకుండా చేస్తుంది. ఎప్పుడు తలస్నానం (Head bath) చేసేటప్పుడు బాగా తక్కువ గాఢత ఉన్న షాంపూతో స్నానం చేయడం మంచిది.
 

hair

చలికాలంలో ఓపెన్ హెయిర్ (Open hair) బయటకు తిరగడం వల్ల జుట్టు ఎక్కువగా చిట్లుతుంది. ఈ చిక్కును విడిపించడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో బలంగా దువ్వడం (Combing) జరుగుతుంది. అప్పుడు జుట్టు ఎక్కువగా చిట్టి రాలిపోతుంది. కనుక చలికాలంలో ఓపెన్ హెయిర్ తో బయటకు వెళ్ళరాదు. చలికాలంలో ఎక్కువగా నీరు తాగడంతో జుట్టుకు తగిన తేమ అంది జుట్టు  పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

click me!