ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఈవెంట్‌లో దాదాపు 800 మంది అతిధులు పాల్గొంటారని, ఈ ఈవెంట్‌ని ఒకే చోట కాకుండా ఇటలీ నుంచి బయల్దేరి భారీ లగ్జరీ షిప్‌లో ఆనంద్ అంబానీ వివాహ వేడుక జరగనుందని కొంత సమాచారం.
ఓడలో అతిథులను అలరించడానికి దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఈ లగ్జరీ షిప్ 4380 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కూడా చెబుతున్నారు. ఇందుకోసం అంబానీ ఫ్యామిలీ రకరకాల ఏర్పాట్లు చేస్తోందని చెప్పొచ్చు.