Megastar Chiranjeevi fitness: ‘అన్నయ్య’ఇంత ఏజ్ లోనూ అంత ఫిట్ గా ఉండటానికి కారణాలేంటో తెలుసా?

First Published Jan 20, 2022, 10:49 AM IST


Megastar Chiranjeevi fitness: మెగాస్టార్ చిరంజీవి 60 ఏండ్లు దాటాకా కూడా ఇంత ఫిట్ గా ఉండటానికి కారణాలేంటబ్బా అని చాలా మందికి డౌట్లు వచ్చుంటాయి. ఎందుకంటే ఈ సీనియర్ నటుడు కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా నటనలోనూ, అదిరిపోయే స్టెప్పులు వేయడంలోనూ వెనక్కి తగ్గేదేలే.. అన్నట్టు ఉంటారు. అందులోనూ ఈ అన్నయ్య వేసే స్టెప్పులు మరెవరికీ సాధ్యం కాదేమో అనిపించే విధంగా ఉంటాయి. మరి ఇంత వయసులోనూ మెగాస్టార్ ఇంత ఫిట్ గా ఉండటానికి కారణాలు ఏమిటంటే..

Megastar Chiranjeevi fitness: లాహే.. లాహే .. లాహే అంటూ ఆచార్య సినిమాలో అదిరిపోయే స్టెప్పులతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల చేత వహ్ వా.. వహ్ వా.. అనిపించారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాంటి ఎనర్జిటిక్ స్టెప్పులు వేసారో ఇప్పుడు కూడా అలాంటి ఎనర్జిటిక్ స్టెప్పులనే ఎలా వేయగలుగుతున్నారని ఆయన అభిమానులు తెగ ఆశ్చర్యపోతున్నారు. అవును మరి నాటి నుంచి నేటి వరకు చిరంజీవి మాటతీరులోనూ, బాడీ లాంగ్వేజీ లోనూ, ఫిల్ నెస్ లోనూ అలాగే ఉన్నారు. అందులోనూ ఈ సీనియర్ హీరోకు ఫిట్ నెస్ మామూలుగా ఉండదు. అందుకే కదా 66 వయస్సులోనూ కిర్రాక్ అనిపించే స్టెప్పుులను వేస్తూ కుర్రకారు చేత ఈలలు వేయిస్తున్నారు. అందులోనూ అలుపెరగకుండా, ఫుల్ ఎనర్జిటిక్ గా వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానులకు Surprise ఇస్తున్నారు. మరి ఈ సీనియర్ హీరో ఇంత జోష్ తో, ఎంతో ఎనర్జిటిక్ గా, అంత ఫిట్ గా ఉండటానికి కారణాలేంటో తెలుసుందాం పదండి. 
 

బాడీ ఫిట్ గా ఉండాలంటే Physical fitness తో పాటుగా మానసికంగా కూడా Strong గా ఉండటం చాలా ముఖ్యమని మెగస్టార్ అంటున్నారు. మానసికంగా దృఢంగా  ఉన్నప్పుడే మనం మరింత ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండగలుగుతామని చిరు నమ్ముతారు. అందుకే ఆయన మానసికంగా దృఢంగా  ఉండేందుకు ఎంతో ప్రయత్నిస్తారట. అందులో ఒక వ్యక్తి ఎంత కూల్ గా ఉంటే అంత  Strong అవుతారని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలా స్ట్రెస్ ఫ్రీగా ఉండటం వల్ల మానసికంగా బలంగా ఉండగలుగుతామని.. తద్వారా శరీరం ఎంతో ప్రభావితం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
 

 అలాగే ఆత్మవిశ్వాసం కూడా మనిషి ఫిట్ గా ఉండేందుకు ఉపయోగపడుతుందని చిరు నమ్ముతారు. ఆత్మవిశ్వాసం ముందు తన వయస్సు కూడా చిన్నదే అని చిరు చెప్పుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎంతో బిజీ బిజీ లైఫ్ ను లీడ్ చేసే చిరు.. తన లైఫ్ ను తాను కళలు కన్న విధంగా జీవించడానికి కాన్ఫిడెన్సే ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొస్తుంటారు. 

కాగా మెగాస్టార్ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తను కేవలం వెజిటేరియన్ ఫుడ్ ను మాత్రమే తింటానని చాలా సందర్భాల్లో తెలయజేశారు. అందులోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా చిరు ఇంట్లో వండిని ఫుడ్ ను మాత్రమే తింటానని ఓ ఇంటర్వ్యూ వేధికగా తెలియజేశారు. అలాగే సినిమాల్లో తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా బాడీని మార్చడం కోసం రెగ్యులర్ గా చిరు జిమ్ కు వెళుతుంటారు. అలా వెల్లడం వల్ల పాత్రకు తగ్గట్టు తయారవడంతో పాటుగా ఫిట్ గా కూడా ఉంటారని ఆయన వెల్లడించారు.

ఇక వీటితో పాటుగా చిరంజీవి 60 పదుల వయసులోనూ ఇంత యంగ్ గా, ఎప్పుడూ ఎనర్జిటిక్ గా కనిపించడానికి అసలు కారణం ఆయన చేసే వర్కౌట్లే. తనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉండనీ.. అయినా కాస్త సమయం దొరికితే చాలు వర్కౌట్లను చేసేస్తుంటారు. ఓ ఇంటర్వ్యూలో.. మార్నింగ్ 4 గంటకే లేచి 6 గంటల వరకు ప్రతి దినం వ్యాయామాలు చేస్తానని తెలిపారు. బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి ఈ అలవాట్లు చాలా ముఖ్యమని చిరు పలు సందర్భాల్లో అన్నారు. అందుకే ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నారు.  

click me!