పిల్లలను చురుకుగా మార్చే యోగాసనాలు ఇవి..!

First Published | May 4, 2024, 4:04 PM IST

ఆటల్లో మాత్రమే కాదు.. కొందరు పిల్లలు చదువుల్లోనూ పెద్దగా ఆసక్తి చూపించరు. చదువుల్లో వెకపడిపోతూ ఉంటారు. మీ పిల్లల్లోనూ ఆ సమస్య ఉంటే.. వారు చదువుల్లో, ఆటల్లో వెకనపడుతున్నారని మీకు అనిపిస్తే.. వారిని వెంటనే యోగాలో చేర్పించాలి.
 

తమ పిల్లలు అన్నింట్లోనూ ముందుండాలని, వారి తెలివి తేటలు పెరగాలని , చాలా చురుకుగా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే.. అందరు పిల్లలు అలా అన్నింట్లోనూ ముందు ఉండాలని రూల్ లేదు. దీంతో.. పేరెంట్స్ తమ పిల్లలు వెనకపడిపోతున్నారని కంగారుపడుతూ ఉంటారు.

ఆటల్లో మాత్రమే కాదు.. కొందరు పిల్లలు చదువుల్లోనూ పెద్దగా ఆసక్తి చూపించరు. చదువుల్లో వెకపడిపోతూ ఉంటారు. మీ పిల్లల్లోనూ ఆ సమస్య ఉంటే.. వారు చదువుల్లో, ఆటల్లో వెకనపడుతున్నారని మీకు అనిపిస్తే.. వారిని వెంటనే యోగాలో చేర్పించాలి.
 


ఎందుకంటే... యోగా కేవలం బరువు తగ్గానికి మాత్రమే కాదు....  పిల్లలు యాక్టివ్ గా మారడానికి కూడా సహాయపడుతుంది.  ముఖ్యంగా పిల్లలతో కొన్ని రకాల యోగాసనాలు చేయించడం వల్ల వారు చాలా చురుకుగా మారతారు. మరి ఆ ఆసానలేంటో ఓసారి చూద్దాం...
 

Vakrasana

1.వక్రాసనం...

ఏకాగ్రత పెంచే యోగాసనం పేరు వక్రాసనం. దీనిని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. నేలమీద నిటారుగా కూర్చుని కాళ్ళు తిన్నగా చాపండి.
ఒక కాలిని మడిచి పక్కకి తీసి దాని పాదం మరో మోకాలి పక్కన వచ్చేలా పెట్టాలి. ఏ కాలైతే వంచామో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలిమీదుగా పెట్టి పాదాన్ని పట్టుకోవాలి. వీలైనంత వరకు నడుమును అటువైపుగా తిప్పాలి, ఇదే మాదిరిగా రెండవ కాలిని మడిచి మరల అదే విధంగా చేయిని, నడుమును తిప్పాలి, ఇలా కనీసం మూడు సార్లు కుడి వైపు, మూడు సార్లు ఎడమ వైపు తిప్పాలి.ఈ యోగాసనం  పిల్లలతో క్రమం తప్పకుండా చేయిస్తే.. వారిలో ఏకాగ్రత సులభంగా పెరుగుతుంది. 
 

vrukshasana

2.వృక్షాసన..
బాడీ బ్యాలెన్స్, అటెన్షన్ పెరగడానికి, ఎకాగ్రత పెంచడానికి పిల్లతో  వృక్షాసన యోగాసనం చేయాలి. ఇది కూడా ఏకాగ్రత పెంచుతుంది.ముందుగా రెండు కాళ్లపై నిటారుగా నిల్చోవాలి. ఆ తర్వాత.. ఒక కాలుని వంచి.. దాని పాదాన్ని మరో కాలు తొడపై ఉంచాలి. ఇలా కొద్ది సేపటి వరకు అలానే నిలపడాలి. తర్వాత రెండో కాలుతో కూడా దీనిని రిపీట్ చేయాలి. దీనిని కూడా తరచూ చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos

click me!