పవన్, మహేష్, నాగార్జున ముగ్గురికి ఝలక్ ఇచ్చిన శోభన్ బాబు.. పంతం పడితే అంతే, చివరికి బ్లాంక్ చెక్ ఇచ్చినా..

First Published May 4, 2024, 3:52 PM IST

శోభన్ బాబుని కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ శోభన్ బాబు పంతం పడితే ఇక తిరుగుండదు. తనని అభిమానులు హీరోగానే గుర్తు పెట్టుకున్నారు కాబట్టి తాను క్యారెక్టర్ రోల్స్ చేయనని శోభన్ బాబు అన్నారు.

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సోగ్గాడిగా శోభన్ బాబు చిరస్థాయిగా నిలిచిపోతారు. వెండితెరపై అందగాడు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తుకు వచ్చేది శోభన్ బాబే. శోభన్ బాబు సినిమాల్లో అల్లరిగా రొమాంటిక్ గా కనిపించారు. రియల్ లైఫ్ లో మాత్రం ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. 

Sobhan Babu

శోభన్ బాబు చివరి వరకు హీరో గానే నటించాలని అనుకున్నారు. అయితే శోభన్ బాబుని కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ శోభన్ బాబు పంతం పడితే ఇక తిరుగుండదు. తనని అభిమానులు హీరోగానే గుర్తు పెట్టుకున్నారు కాబట్టి తాను క్యారెక్టర్ రోల్స్ చేయనని శోభన్ బాబు అన్నారు. ఆ విధంగా తన వద్దకు వచ్చిన కొన్ని సూపర్ హిట్ చిత్రాలని ఆయన వదిలేసుకున్నారు. 

భీమినేని శ్రీనివాస రావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర చాలా కీలకం. ముందుగా పవన్ తండ్రిగా నటించేందుకు శోభన్ బాబుని అడిగారు. ఆయన ఒప్పుకోకపోవడంతో రఘువరన్ దగ్గరకి ఆ పాత్ర వెళ్ళింది. 

శోభన్ బాబు రిజెక్ట్ చేసిన మరో సూపర్ హిట్ చిత్రం అన్నమయ్య. ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ముందుగా శోభన్ బాబుని అడిగారు. ఆయన ఒప్పుకోలేదు. దీనితో సుమన్ ఆ పాత్రలో నటించి మెప్పించారు. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు చిత్రంలో శోభన్ బాబు నటించాల్సింది. మహేష్ బాబు తాతగారి పాత్రలో శోభన్ బాబుని నటింపజేయాలని నిర్మాత మురళి మోహన్ ఎంతగానో ప్రయత్నించారు. చివరకి శోభన్ బాబుకి మురళి మోహన్ బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారట. కానీ శోభన్ బాబు ససేమిరా అన్నారు. దీనితో చివరకి నాజర్ ఈ పాత్రలో నటించారు. 

ఆ తర్వాత కూడా శోభన్ బాబు కోసం చాలా క్యారెక్టర్ రోల్స్ వచ్చాయి. కానీ శోభన్ బాబు క్యారెక్టర్ రోల్స్ కి ఏమాత్రం అంగీకరించలేదు. ఆ తర్వాత శోభన్ బాబు, జగపతి బాబు, కృష్ణ సోదరులుగా  కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాల్సింది. ఆ చిత్రం పట్టాలెక్కలేదు. 

click me!