కూరల్నే కాదు మీ సెక్స్ జీవితాన్ని కూడా స్పైసీగా మార్చే కొత్తిమీర

First Published Sep 6, 2020, 9:39 AM IST

కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇది బీపీని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. హైబీపీ క్రమంగా టైప్ 2 డయాబెటిస్ గా మారే అవకాశం ఉంది

లేత ఆకుపచ్చ రంగులో.. నొక్కులు నొక్కులు డిజైన్ తో చూడగానే చాలా లేతగాకనిపించే కొత్తిమీరలో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే కొత్తిమీరను రోజూ కూరల్లో వాడితే మంచిది. అయితే కొత్తిమీరను కూరల్లో ఎలా వేయాలి. వాటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూడండి..
undefined
కొత్తిమీరను కూర వండిన తర్వాతే పైన చల్లాలి. అంతే కానీ కూడ ఉడుకుతున్నప్పుడు వేయకూడదు. అలా వేస్తే కొత్తిమీరలోని పోషకాలు ఆవిరైపోతాయి. కొత్తిమీర చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అతి వేడిని తట్టుకోలేదు. కొత్తిమీర కొరియాండ్రమ్ సాతివమ్ జాతికి చెందిన మొక్క. దీన్ని చైనీస్ పార్స్‌లీ అని కూడా అంటారు.
undefined
కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇది బీపీని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. హైబీపీ క్రమంగా టైప్ 2 డయాబెటిస్ గా మారే అవకాశం ఉంది. కొత్తిమీర, ధనియాలు, ధనియాల నూనె వంటివి... బీపీని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించడంలో, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తోంది.
undefined
కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి విష వ్యర్థాలకు చెక్ పెట్టడంతో బాగా పనిచేస్తాయి. శరీర కణాలను కాపాడతాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతియ్యకుండా చేస్తాయి. కడుపులో మంటలు తగ్గాలన్నా, కాన్సర్ బారిన పడకుండా ఉండాలన్నా... కొత్తిమీరే బెస్ట్.
undefined
అంతేకాదు గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతోంది. హైబీపీని కంట్రోల్‌లో ఉంచుతూ, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బాడీలో అధికంగా ఉండే సోడియంను బయటకు పంపి గుండెకు మేలు చేస్తుంది.
undefined
మన మెదడు చాలా సున్నితమైనది. రకరకాల వ్యాధులు దాన్ని నాశనం చెయ్యడానికి ఎదురుచూస్తూ ఉంటాయి. ముఖ్యంగా మతిమరపు, పార్కిన్‌సన్స్, అల్జీమర్స్ వంటివి ఏజ్ పెరుగుతున్న దశలో మెదడుపై దాడి చేస్తాయి. సరిగ్గా ఆ టైమ్‌లో కొత్తిమీర తీసుకుంటే... ఇక ఆ వ్యాధులు మన బ్రెయిన్ దరిచేరవు. నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా కొత్తిమీర కాపాడుతుంది.
undefined
ఒత్తిడిని జయించడంలోనూ కొత్తిమీర బాగా పనిచేస్తుంది. పిల్లల నుండి పెద్దలు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇలా ప్రతీ ఒక్కరు ఏదో రకమైన ఒత్తిడిని ఎదుర్కుంటూనే ఉంటారు. ఈ టెన్షన్ తట్టుకోవాలంటే కొత్తిమీర తినాలి. అందులో యాంటీఆక్సిడెంట్స్... బ్రెయిన్‌ ఎక్కువ హీట్ అవ్వకుండా చేస్తాయి. మెమరీ పవర్ పెంచుతాయి.
undefined
జీర్ణవ్యవస్థను కాపాడడంలోనూ కొత్తిమీర బాగా పనిచేస్తుంది. పేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. మాటిమాటికీ కడుపునొప్పి వచ్చేవాళ్లు, మలబద్ధకంతో బాధపడేవాళ్లు... రోజూ కొత్తిమీర తినాలి. ఇలా 8 వారాలు తింటే... అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. చక్కగా ఆకలి వేస్తుంది... చక్కగా అరుగుతుంది కూడా.
undefined
సూక్ష్మక్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు ఉన్నాయి. దీంట్లోని డోడెసెనాల్ అనే పదార్థం... బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాకి కొత్తిమీర తగిలిందంటే... అది చావాల్సిందే. తద్వారా ఇన్ఫెక్షన్లను బాగా తగ్గిస్తుంది.
undefined
చర్మంపై దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, గాట్లు, దెబ్బలు, గాయాలు, నీరు కారడం, ఉబ్బడంలాంటివాటికి చక్కటి మందు కొత్తిమీర. అందుకే రోజూ కొత్తిమీర తింటా వుంటే... చర్మం సంగతి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పిల్లల చర్మ సంరక్షణలో కొత్తిమీర అత్యంత కీలకమైనది. విపరీతమైన ఎండల వల్ల చర్మం పాడవకుండా లోలోపల నుంచీ కొత్తిమీర కాపాడుతుంది.
undefined
ఇక కొత్తిమీర కేవలం మీ కూరలనే కాదు... మీ సెక్స్ లైఫ్ ని కూడా స్పైసి గా మారుస్తుంది. మనుషుల్లో సెక్స్ డ్రైవ్ ని పెంపొందించడానికి ఇది బాగా తోడ్పడుతుంది. కొత్తిమీర అందుబాటులో లేకపోతే ధనియాలయినా పర్వాలేదు.
undefined
పురుషులు తమ సెక్స్ పటుత్వాన్ని అలాగే నిలుపుకోవాలన్నా, సెక్సువల్ గా మన్మధ సామ్రాజ్యంలో విహరించాలన్న వారికిఅత్యంత కీలకమైనది జింక్. కొత్తిమీరతో జింక్ అధికంగా లభిస్తుంది.
undefined
లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల కారణంగా పురుషుల్లో ఈ మధ్యకాలంలో బీపీ, షుగర్ లాంటి రోగాల బారిన పాడడం మనం తరచుగాచూస్తున్నాము. ముఖ్యంగా షుగర్ వల్ల తమలో సెక్స్ కోరికలు తగ్గాయని భావించేవారు కొందరు. కొత్తిమీరగనుక క్రమం తప్పకుండా తీసుకుంటే...శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఏ అనారోగ్యం లేని వారు, లేదా ఉన్న వాటిని కంట్రోల్ లో ఉంచుకోగలిగినవారు రతిక్రీడలో తమ భాగస్వామితో సహా మధురానుభూతులను చవి చూస్తారు.
undefined
ఫ్రెష్ కొత్తిమీర ఎప్పటికప్పుడు కావాలంటే ఇంట్లోనో ఓ చిన్న కుండీలో ఇంత ఇసుక వేసి నాలుగు ధనియాల గింజలు వేస్తే సరి. మీకు కావాల్సినప్పుడు తాజాగా వాడేయడమే.
undefined
click me!