చంద్ర గ్రహణం గర్భిణులకు అంత ప్రమాదకరమా? ఈ సమయంలో చేయాల్సినవి, చేయకూడని పనులు ఇవే..

First Published Nov 7, 2022, 10:46 AM IST

గ్రహణాలు గర్భిణీ స్త్రీలకు అంత మంచివి కావని.. ఇలాంటి సమయంలో వీళ్ళు ఇంటి బయటకు అసలే వెళ్లకూడదని చాలా మంది నమ్ముతుంటారు. మరి  ఈ గ్రహణ సమయంలో గర్బిణులు ఎలాంటి పనులు చేయకూడదో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఖగోళ సంఘటనలే గ్రహణాలు. ఇవి చాలా కామన్. కానీ ఇవి చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. చంద్రగ్రహణం అంటే.. చంద్రుడికి సూర్యునికి భూమి అడ్డుగా వస్తుంది. అంటే సూర్యుని కాంతిని చంద్రుడిని చేరుకోకుండా భూమి మధ్యలోకి వస్తుంది. అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉంటాయి. దీనిలో భూమి సూర్యుడు, చంద్రుడి మధ్యలో ఉంటుంది. కాగా రేపే చంద్రగ్రహనం (నవంబర్ 8). జ్యోతిష్యం ప్రకారం.. చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం.. ఈ గ్రహణం ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణులకు. 
 

Lunar Eclipse 2022

మత విశ్వాసాల ప్రకారం.. గర్భిణులకు చంద్రగ్రహణం చెడు ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. అందుకే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారు. ఇప్పుడే కాదు.. ఎన్నో ఏండ్ల నుంచి గ్రహణాలు.. అంటే సూర్య గ్రహణం, చంద్రగ్రహణం రెండూ గర్భిణులకు మంచివి కావని అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రహాణాల సమయంలో ఒక్క తల్లి గురించే కాదు.. పుట్టబోయే బిడ్డ గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సలహానిస్తుంటారు. 

కానీ ఈ వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ గ్రహణ సమయంలో గర్భిణులు ఇండ్ల నుంచి బయటకు అడుగుపెట్టకూడదని చాలా మంది చెప్తారు. ఎందుకంటే ఇవి పుట్టబోయే బిడ్డకు హాని కలిస్తుందని నమ్ముతారు. ఎలా అంటే వీటివల్ల పిల్లలు నెలలు నిండకుండానే  పుట్టే అవకాశం ఉందని. కొన్ని పురాణాలు కూడా ఈ విషయాల్ని వెల్లడిస్తున్నాయి. గ్రహణాల వల్ల ఇలాంటివేమీ జరగవని చాలా మంది జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వాటిని నమ్మినవారు తక్కువే. అందుకే నేటికీ ఎంతోమంది ఈ విషయాలను ఫాలో అవుతున్నారు. ఈ సంప్రదాయాలను ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఏదేమైనా ఈ వీటిని పాటించే గర్బిణీ స్త్రీలు చంద్రగ్రహణంలో చేయదగినవి, చేయకూడని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు చేయకూడనివి? 

బయటకు అసలే వెళ్లకూడదు

గ్రహణనికి ముందు వంటిన ఆహారాలన్ని అసలే తినకూడదు. గ్రహణం తర్వాత ఫ్రెష్ గా వండుకుని తినాలి. 

గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి. 

గ్రహణం సమయంలో ఏదైనా తాగడం, తినడం లాంటివి చేయకూడదు. 

గ్రహణం కిరణాలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి కిటికీలను మూసేయాలి. 

గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. 

చివరిగా.. అన్నింటికంటే ముందు అపోహలు, మూఢనమ్మకాలే మనిషి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. మానసికంగా క్రుంగదీస్తాయి. అందుకే వీటిని ఎంతవరకు నమ్మాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. 

చంద్రగ్రహణం గురించి ఇంకొన్ని విషయాలు..

చంద్రగ్రహణం అంటే ఏమిటి? 

సూర్యుని కాంతి చంద్రుడిని చేరుకోకుండా భూమి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. అంటే సూర్యుడు. భూమి, చంద్రుడు ఒకదానికొకటి చాలా దగ్గరగా సమలేఖనంలో ఉంటాయి. ఇవి సరళరేఖలో ఉంటాయి. దీనిలో భూమి సూర్యుడు, చంద్రుడి మధ్యలో ఉంటుంది. 

2022 లో చంద్రగ్రహణం ఎప్పుడు

2022 లో రెండు చంద్రగ్రహణాలు సంభవిస్తాయి. రెండు సూర్య గ్రహణాలు సంభవిస్తాయి. రాబోయే చంద్ర గ్రహణం రేపే. అంటే నవంబర్ 8 మంగళవారం నాడు. 

చంద్రగ్రహణం గర్భిణీ స్త్రీలను ఎలా ప్రభావితం చేస్తుంది? 

చంద్రగ్రహణం గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ పురాతన నమ్మకాల ప్రకారం.. గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఇలాంటి సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంటారు. 

చంద్రగ్రహణం సమయంలో గర్బిణీస్త్రీలు చేయకూడనివి? 

చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారాలను అసలే తినకూడదు. గ్రహణం సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఎలాంటి పనులను చేయకూడదుు. ఈ సమయంలో ఎలాంటివి తాగకూడదు. తినకూడదు. గ్రహణం అయినపోయిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. 

click me!